దేశంలో నెంబర్ వన్.. మొబైల్ ఫోన్ల రికవరిలో తెలంగాణ అగ్రస్థానం: ఏడీజీపీ చారు సిన్హా

by Ramesh Naini |

పోగుట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరిలో దేశ వ్యాప్తంగా తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని సీఐడీ ఏడీజీపీ చారు సిన్హా తెలిపారు.

దేశంలో నెంబర్ వన్.. మొబైల్ ఫోన్ల రికవరిలో తెలంగాణ అగ్రస్థానం: ఏడీజీపీ చారు సిన్హా
X

దిశ, తెలంగాణ బ్యూరో: పోగుట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరి(mobile phone recovery)లో దేశ వ్యాప్తంగా తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని సీఐడీ ఏడీజీపీ చారు సిన్హా (CID ADGP Charu Sinha) తెలిపారు. అక్టోబరు 16వ తేదీ వరకు 1,00,20 మొబైల్స్‌ను రికవరీ చేయడం జరిగిందని ఆమె తెలిపారు. సెంట్రల్ ఎక్యూప్‌మెంట్ ఐడెంటిటి రిజిస్ట్రర్ (సీఈఐఆర్)పోర్టల్ ద్వారా రికవరీ చేసిన మొబైల్స్ వివరాలు శుక్రవారం ఏడీజీపీ వెల్లడించారు. సీఈఐఆర్ పోర్టల్ ను 2022 సెప్టెంబర్ 5వ తేదిన ప్రారంభించారని తెలంగాణలో 2023 ఏప్రిల్ 19న అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. అయినా దేశ వ్యాప్తంగా తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో నిలవడం గర్వకారణమని పేర్కోన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 780 పోలీస్ స్టేషన్లలో సీఈఐఆర్ పోర్టల్ అమలు జరుగుతున్నట్లు ఆమె వెల్లడించారు. మొబైల్ వినియోగదారులు ప్రతి ఒక్కరు సీఈఐఆర్ పోర్టల్‌ని వినియోగించుకొవాలని సూచించారు. డీవోటీ, సీఈఐఆర్ పోర్టల్ తో రాష్ట్ర పోలీస్ వ్యవస్థ తీసుకువచ్చిన తెలంగాణ పోలీస్ సిటిజన్ పోర్టల్ సమన్వయం చేస్తుందని తెలిపారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వినియోగదారుడు www.tspolice.gov.in లేదా www.ceir.gov.in ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఈ ఘనత సాధించడానికి కృషి చేసిన డివోటీ ప్రతినిధులను, డీడీజీ సెక్యూరిటీ, డైరెక్టర్ సెక్యూరిటీ జెటీవో సెక్యూరిటీ ప్రతినిధులను, సిబ్బందిని ఏడీజీపీ చారు సిన్హా అభినందించారు.

Next Story