TG: తెలంగాణలో ఎన్టీపీసీ మరో భారీ పెట్టుబడి.. సీఎంను కలిసిన బృందం

by Prasad Jukanti |   (  Updated:2025-08-09 09:37:40  IST  )

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మరో సంస్థ ముందుకు వచ్చింది.

TG: తెలంగాణలో ఎన్టీపీసీ మరో భారీ పెట్టుబడి.. సీఎంను కలిసిన బృందం
X

దిశ,తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ఎన్టీపీసీ ముందుకు వచ్చింది. సోలార్, విండ్ విద్యుత్ ప్రాజెక్టుల్లో దాదాపు రూ.80 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎన్టీపీసీ సీఎండీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరిచారు. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) ఇవాళ ఎన్టీపీసీ (NTPC) సీఎండీ గురుదీప్ సింగ్ (CMD Gurdeep Singh) బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి రంగంలో పెట్టుబడులకు సుముఖంగా ఉన్నట్లు ఈ సందర్భంగా ఈ టీమ్ వివరిచింది. ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ద్వారా 6700 మెగావాట్ల ఉత్పత్తికి అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్టీపీసీకి అన్ని విధాలా సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

Next Story