కాంగ్రెస్ సభను చూసి బీఆర్ఎస్ నేతల్లో వణుకు.. బల్మూరి వెంకట్

by Javid Pasha |   (  Updated:2023-12-16 14:57:08  IST  )

కాంగ్రెస్ జనగర్జనను చూసి బీఆర్ఎస్ నేతల్లో వణుకు మొదలైందని ఎన్ఎస్యూఐ నేత బల్మూరి వెంకట్ అన్నారు.

కాంగ్రెస్ సభను చూసి బీఆర్ఎస్ నేతల్లో వణుకు..  బల్మూరి వెంకట్
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ జనగర్జనను చూసి బీఆర్ఎస్ నేతల్లో వణుకు మొదలైందని ఎన్ఎస్యూఐ నేత బల్మూరి వెంకట్ అన్నారు. ఖమ్మం పట్టణంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ జనగర్జనలో బల్మూరి వెంకట్ మాట్లాడారు. జనగర్జన సభకు కాంగ్రెస్ కార్యకర్తలు రాకుండా బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

తమ సభను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్ ను హైదరాబాద్ లో తిరనీయబోమని హెచ్చరించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Next Story