బాసర IIIT ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

by Muthe.Rajitha |

తెలంగాణలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(RGUKT) బాసర IIIT (Basara IIIT) ప్రవేశాలకు నోటిఫికేషన్(Entrance Notification) విడుదల అయింది.

బాసర IIIT ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(RGUKT) బాసర IIIT (Basara IIIT) ప్రవేశాలకు నోటిఫికేషన్(Entrance Notification) విడుదల అయింది. 2025-26 విద్యా సంవత్సరానికి 6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీ.టెక్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాల కోసం ఈ నోటిఫికేషన్ విడుదలైనట్టు RGUKT వీసీ ప్రొఫెసర్ వెంకట రమణ, డైరెక్టర్ ప్రొఫెసర్ సతీష్ ఓ ప్రకటన విడుదల చేశారు.

నోటిఫికేషన్ వివరాలు: ప్రోగ్రామ్: 6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీ.టెక్ (2 సంవత్సరాల ప్రీ-యూనివర్సిటీ కోర్సు + 4 సంవత్సరాల బీ.టెక్).

సీట్లు: మొత్తం 1,500 సీట్లు. 85% సీట్లు తెలంగాణ స్థానిక విద్యార్థులకు, 15% సీట్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మెరిట్ ఆధారంగా కేటాయిస్తారు. 5% సీట్లు గ్లోబల్ కేటగిరీ (ఇతర రాష్ట్రాలు, గల్ఫ్ దేశాల్లోని భారతీయుల పిల్లలు), 2% సీట్లు అంతర్జాతీయ/NRI విద్యార్థులకు కేటాయిస్తారు.

అర్హత: 2025లో 10వ తరగతి (SSC) లేదా తత్సమాన పరీక్షలో మొదటి ప్రయత్నంలో ఉత్తీర్ణత. వయసు 18 ఏళ్లు మించకూడదు (SC/ST విద్యార్థులకు 21 ఏళ్లు) 2025 డిసెంబర్ 31 నాటికి.

ఎంపిక విధానం: 10వ తరగతి GPA, సబ్జెక్టుల్లో వచ్చిన గ్రేడ్‌ల ఆధారంగా మెరిట్ ద్వారా ఎంపిక. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు 0.4 డిప్రివేషన్ స్కోర్ జోడిస్తారు.

అప్లికేషన్ వివరాలు: ఆన్‌లైన్ దరఖాస్తులు జూన్ 1, 2025 నుంచి జూన్ 22, 2025 వరకు స్వీకరిస్తారు. TS ఆన్‌లైన్ సెంటర్, మీసేవా లేదా వర్సిటీ వెబ్‌సైట్ www.rgukt.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఫీజు: గ్లోబల్ కేటగిరీకి సంవత్సరానికి రూ.1,37,000, అంతర్జాతీయ/NRI విద్యార్థులకు రూ.3,01,000.

కాంటాక్ట్ : వివరాల కోసం www.rgukt.ac.in సందర్శించాలి లేదా [email protected]కు ఈమెయిల్ చేయవచ్చు.

ప్రత్యేక కేటగిరీ (CAP, NCC, PH, స్పోర్ట్స్) విద్యార్థుల ధృవీకరణ ప్రక్రియ మే 28 నుంచి మే 31 వరకు నిర్వహించనున్నారు. మరోవైపు ఈ ఏడాది కొత్తగా ఏర్పాటైన మహబూబ్‌నగర్ క్యాంపస్‌లో కూడా 180 సీట్లు అందుబాటులో ఉండనున్నాయి.

Next Story