- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో రేపే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కు లైన్ క్లియర్ అయింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల (local body elections) నోటిఫికేషన్ కు లైన్ క్లియర్ అయింది. నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి స్టే ఇచ్చేందుకు హైకోర్టు (High Court) నిరాకరించింది. బీసీ రిజర్వేషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా నోటిపికేషన్‍కు సంబధించి స్టే ఇవ్వాలని పిటిషనర్ తరఫున న్యాయవాదులు కోర్టును కోరారు. ఇందుకు నిరాకరించిన న్యాయస్థానం నోటిఫికేషన్ యథావిధిగా ఇచ్చుకోవచ్చని స్పష్టం చేసింది. దీంతో షెడ్యూల్ ప్రకారం రేపు యథావిధిగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదలై నామినేషన్ల ప్రక్రియ షురూ కానుంది. తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం లీగల్ టీమ్‍తో చర్చిస్తోంది. మరికాసేపట్లో జిల్లా కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతోంది. మర వైపు బీసీ రిజర్వేషన్లపై తదుపరి విచారణ హైకోర్టులో రేపటికి వాయిదా పడింది.






