- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: 28,000 పోస్టులు.. నోటిఫికేషన్ జారీ
ఇంటింటికీ ఇంటర్నెట్, కేబుల్, ఓటీటీ, రిమోట్ కంప్యూటర్, ఇతర ఈ-గవర్నెన్స్ సేవలను ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా టీ-ఫైబర్‌ను తీసుకొచ్చింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంటింటికీ ఇంటర్నెట్, కేబుల్, ఓటీటీ, రిమోట్ కంప్యూటర్, ఇతర ఈ-గవర్నెన్స్ సేవలను ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా టీ-ఫైబర్‌ను తీసుకొచ్చింది. అయితే.. ఇందులో లోకల్ కేబుల్ ఆపరేటర్లను భాగస్వామ్యం చేసేందుకు సంస్థ ఎండీ నోటిఫికేషన్ జారీ చేశారు. టీ-ఫైబర్ ద్వారా లోకల్ కేబుల్ ఆపరేటర్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. గ్రామ, మండల, జిల్లా కేంద్రాల్లో టీ-ఫైబర్ టెలికాం నెట్‌వర్క్ ఎక్విప్‌మెంట్ల నిర్వహణ, భద్రత, రక్షణ, కేబుల్, ఐపీ టీవీ, బ్రాడ్ బ్యాండ్, ఇతర విలువ ఆధారిత సేవల కోసం అప్లికేషన్లు ఆహ్వానిస్తున్నట్లు ఎండీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రెవెన్యూ షేరింగ్ ప్రాతిపదికన ఇంటింటికీ నెట్ అందించేందుకు సంబంధిత సేవలలో అర్హత, అనుభవజ్ఞులైన లోకల్ కేబుల్ ఆపరేటర్లు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గురువారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించినట్లు తెలిపారు. కాగా.. మొదటి రోజే ఆపరేటర్ల నుంచి విశేష స్పందన వచ్చినట్లు ఎండీ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 28,000 మందికి అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు.






