- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోర్టు ధిక్కరణ కింద రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ
హై కోర్టు ఆదేశాలను అమలు చేయనందకు తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ అయ్యాయి.

దిశ, వెబ్ డెస్క్: హై కోర్టు ఆదేశాలను అమలు చేయనందకు తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి కోర్టు ధిక్కరణ నోటీసులు (Contempt of court notices) జారీ అయ్యాయి. గతంలో గడువు ముగిసినా మత్స్య సంఘాల ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ప్రభుత్వాన్ని నిలదీసి.. వీలైనంత త్వరగా మిగిలిన 21 జిల్లాల్లో మత్స్య సహకార సంఘం (Fisheries Cooperative Society) ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ముదిరాజ్ సంఘం నాయకులు మరోసారి కోర్టును ఆశ్రయించి.. కోర్టు ధిక్కరణ కింద పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పై మరోసారి విచారించిన హైకోర్టు.. కోర్టు ధిక్కరణ కింద రాష్ట్ర ప్రభుత్వానికి (State Govt) నోటీసులు జారీ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఈ పిటిషన్ పై తదుపరి విచారణ నవంబర్ 14కు వాయిదా వేసింది. మరి కోర్టు నోటీసులపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.






