టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ పదవి మీద ఆసక్తి లేదు: జగ్గారెడ్డి

by Malleboina Mahesh |

హరీష్ రావు మీద కోపంతోనే తాను టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరినట్లుగా కవిత ఇచ్చిన స్టేట్మెంట్ తప్పు..హారీష్ రావు తో నేను ఆ ఆ పార్టీని వీడలేదు.

టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ పదవి మీద ఆసక్తి లేదు: జగ్గారెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : హరీష్ రావు మీద కోపంతోనే తాను టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరినట్లుగా కవిత ఇచ్చిన స్టేట్మెంట్ తప్పు..హారీష్ రావు తో నేను ఆ ఆ పార్టీని వీడలేదు.. మున్సిపల్ ఎన్నికల్లో తాను, హరీష్ రావులే టీఆర్ఎస్ ని గెలిపించాం..దానితో పార్టీలోకి రావాలని అప్పటి సీఎం వైఎస్సార్ మిత్రుడు కుసుమ కుమార్ తో కబురు ఆయన పంపించారు.. కందిలో ఐఐటీ ఇస్తామన్నారు.. నా రాజకీయం వైఎస్సాఆర్ కి నచ్చింది..అందుకే కాంగ్రెస్ లో చేరాను అని జగ్గారెడ్డి వివరించారు. తనపైన కవిత చెప్పిన అంశాలను ఆమె సోషల్ మీడియా టీం చేస్తున్న ప్రచారాన్ని ఆపాలని ఆయన సూచించారు.

ఆదివారం గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ కవిత కేసీఆర్ కూతురు అయినందున లీడర్ అయ్యారని, మీ పంచాయతీ లో మమ్మల్ని ఎందుకు ఇరికిస్తున్నావు.. కెసిఆర్ కూతురికి అవగాహన లేదు అని ఆయన మండిపడ్డారు. ఇతరుల గురించి మాట్లాడే ముందు తన కుటుంబ రాజకీయాల గురించి ఆలోచిస్తే మంచిదని జగ్గారెడ్డి హితవు పలికారు. సీఎంని అవుతానని అంటూ మాట్లాడిని మాటలు తనకు నవ్వోస్తుందని ఆయన తెలిపారు. కేసీఆర్..చంద్రబాబు కూడా కాంగ్రెస్ నుండి బయటకు వెళ్లిన వారే అని, కాంగ్రెస్ అనే సముద్రంలో కలిసే ఉపనదులు లాంటి వారేనని జగ్గారెడ్డి అన్నారు.

నేను డైరెక్ట్ రాజకీయం చేస్తా.. హరీష్ రావు వెనక నుండి పొడుస్తాడు..

హరీష్ రాజకీయం వేరు, జగ్గారెడ్డి రాజకీయం వేరు అని, తాను వ్యక్తిగతంగా ఎదిగిన వాన్ని అన్నారు. రాజకీయంగా ఎప్పుడైనా ఘర్షణ ఉంటందని, సంగారెడ్డి జిల్లా కేంద్రమైనందున టార్గెట్ గా పని చేస్తారని, జిల్లాలో రాజకీయంగా హరీష్..జగ్గారెడ్డి మధ్య వార్ నడుస్తూనే ఉంటదని ఆయన తెలిపారు. నేను రాహుల్ గాంధీ సభ పెడితే హరీష్ రావు ను కేసీఆర్ పిలిచి తిట్టిండు.. అందుకు తర్వాత జరిగిన ఎన్నికల్లో నన్ను హరీష్ ఒడగొట్టాలని చూశాడు.. నేను డైరెక్ట్ రాజకీయం చేస్తా.. హరీష్ రావు వెనక నుండి పొడుస్తడు. ఆయనదో రాజనీతి.. ఆలో విధానాలు వేరుగా ఉంటాయని జగ్గారెడ్డి అన్నారు. అయితే తాను హరీష్ రావు పని పురుగులమని, అందుకే మేమే జిల్లా రాజకీయాల్లో కనిపిస్తామన్నారు. తాను కొంత డిస్ట్రబ్ అయ్యాయని, సర్పంచ్ ల మీటింగ్ లో రాహుల్ గాంధీ ఫోటో ఒక్కటే పెట్టాలని చెప్పినట్లుగా జగ్గారెడ్డి తెలిపారు.

ప్రచార కమిటీ చైర్మన్ పదవి మీద కూడా ఆసక్తి లేదని, అప్పట్లో ఉండేదని, ఎవరి వల్ల డిస్ట్రబ్ అయ్యా అనేది తర్వాత చెప్తానని, నెలలో చెప్తా అని జగ్గారెడ్డి అన్నారు. తాను ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి రాలేనని, అనేక ప్రశ్నలు వస్తాయి, దానికి సమాధానం చెప్పలేనన్నారు. రాజకీయంగా ఆవేశంగా నిర్ణయాలు తీసుకోవద్దని, వార్ డిక్లర్ చేస్తే, కొడుతూనే ఉండాలని, ప్రజలు, రాజకీయాలు తర్వాతనే ఫ్యామిలీ అని, తన శైలి అదేనని జగ్గారెడ్డి చెప్పారు. తమ ఫ్యామిలీకి డీసీసీ అద్యక్ష పదవి వద్దనుకొన్నామని, అందుకే ఆ పదవిని ఉజ్వల్ రెడ్డికి ఇవ్వాలని ఇప్పటికే తాము లేఖ ఇచ్చామన్నారు.

Next Story