- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మావోయిస్టుల ఉనికి తెలంగాణలో పెద్దగా లేదు.. నార్త్ జోన్ IG కీలక వ్యాఖ్యలు
తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ సరిహద్దు(Telangana - Chhattisgarh Border)ల్లో ఆపరేషన్ కగార్(Operation Kagar) కొనసాగుతోందని నార్త్ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి(North Zone IG Chandrasekhar Reddy) స్పష్టం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ సరిహద్దు(Telangana - Chhattisgarh Border)ల్లో ఆపరేషన్ కగార్(Operation Kagar) కొనసాగుతోందని నార్త్ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి(North Zone IG Chandrasekhar Reddy) స్పష్టం చేశారు. సోమవారం ఐజీ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో మావోయిస్టుల(Maoists) ఉనికి పెద్దగా లేదని అన్నారు. ఆపరేషన్ కగార్ ప్రభావం కూడా తక్కువే అని చెప్పారు. మూడు నెలల్లో 250 మావోయిస్టులు లొంగిపోయారని స్పష్టం చేశారు. శాంతి చర్చల విషయమై ప్రభుత్వ ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని అన్నారు. కాగా, మావోయిస్టులతో కేంద్రం శాంతి చర్చలు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని శాంతి చర్చల కమిటీ నేతలు నిన్న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని కోరారు.
జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని కోరారు. దీనిపై సీఎం రేవంత్ మాట్లాడుతూ.. నక్సలిజాన్ని సామాజిక కోణంలో మాత్రమే చూస్తామని, శాంతి భద్రతల అంశంగా పరిగణించమని స్పష్టం చేశారు. మావోయిస్టులతో చర్చలు జరిపిన అనుభవం ఉన్న జానారెడ్డి సలహాలు, సూచనలు తీసుకుంటామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే సోమవారం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్, శాంతి చర్చలు, కాల్పుల విరమణ తదితర అంశాలపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. గతంలో జానారెడ్డి హోంమంత్రిగా పనిచేసిన సమయంలో మావోయిస్టులతో చర్చలు జరిపిన అనుభవం ఉండటం వల్ల, ఆయన సలహాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కీలకంగా మారాయి.






