- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్యాన్సర్ కేర్ సిస్టమ్ అభివృద్ధికి సహకరిస్తాం.. సీఎంని కలిసిన పద్మశ్రీ నోరి దత్తాత్రేయుడు
రాష్ట్రంలో క్యాన్సర్ కేర్ సిస్టమ్ అభివృద్ధికి ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని పద్మశ్రీ నోరి దత్తాత్రేయుడు ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో (Cancer) క్యాన్సర్ కేర్ సిస్టమ్ అభివృద్ధికి ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని పద్మశ్రీ నోరి దత్తాత్రేయుడు (Dattatreyudu Nori) ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. ఇవాళ (ఆదివారం) జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని ప్రముఖ ఆంకాలజిస్ట్ పద్మశ్రీ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో విద్య, వైద్య రంగాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని డా. నోరి దత్తాత్రేయుడు ప్రశంసించారు. క్యాన్సర్ చికిత్సను మెరుగుపరచడానికి తన మద్దతును అందించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ను సీఎం రేవంత్ రెడ్డి శాలువ కప్పి సత్కరించారు. కాగా, ప్రఖ్యాత రేడియేషన్ ఆంకాలజిస్ట్, పద్మశ్రీ గ్రహీత డాక్టర్ నోరి దత్తాత్రేయుడు సుప్రసిద్ధ భారతీయ వైద్యుడు, అమెరికాలోని అగ్రశ్రేణి వైద్యుల్లో ఒకరిగా ఉన్నారు. మహిళలలో వచ్చే క్యాన్సర్ వ్యాధులను నయం చేయడంలో సిద్ధహస్తులు.






