- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి కొండా సురేఖకు నాన్‌బెయిలబుల్ వారెంట్
మంత్రి కొండా సురేఖకు నాన్‌బెయిలబుల్ వారెంట్

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి కొండా సురేఖ(Konda Surekha)కు ప్రజాప్రతినిధులు కోర్టు భారీ షాకిచ్చింది. కేటీఆర్(KTR) పరువు నష్టం దావా కేసులో నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గురువారం సుదీర్ఘ విచారణల అనంతరం వారెంట్ జారీ చేసింది. ఫిబ్రవరి 5వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది.
గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై విమర్శలు చేసిన సందర్భంలో నాగచైతన్య, సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన అక్కినేని నాగార్జున, కేటీఆర్ ఇద్దరూ కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. ఇటీవల నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ పశ్చాతాపం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో నాగార్జున తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. కేటీఆర్ వేసిన కేసును తాజాగా విచారించిన కోర్టు.. నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.






