- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sarpanch election: ముగిసిన తొలి దశ సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల పర్వం
మొదటి విడత నామినేషన్ల పర్వం ముగియడంతో అభ్యర్థులు ప్రచారంపై దృష్టి సారించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. గురువారం మొదలైన నామినేషన్ల స్వీకరణ ఇవాళ సాయంత్రం 5 గంటలతో ముగిసింది. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా 31 జిల్లాల్లో 189 మండలాల్లో 4236 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డులకు ఎన్నికలు నిర్వహించబోతున్నారు. రేపు నామినేషన్లను పరిశీంచి చెల్లుబాటు అయ్యే అభ్యర్థుల జాబితాను అధికారులు రెడీ చేయనున్నారు. ఒక వేళ సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థి నామినేషన్లు తిరస్కరణకు గురైతే సదరు అభ్యర్థి సంబంధిత రెవెన్యూ డివిజనల్, సబ్ కలెక్టర్ వద్ద రిటర్నింగ్ అధికారిపై డిసెంబర్ 31 వరకు అప్పీల్ చేసుకోవచ్చు. డిసెంబర్ 2న అప్లీళ్లను పరిష్కరిస్తారు. డిసెంబర్ 3న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను అభ్యర్థులు ప్రకటించి వారికి ఎన్నికల గుర్తులను కేటాయించనున్నారు. డిసెంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజున మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నారు. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో అభ్యర్థులు ప్రచారంపై ఫోకస్ పెట్టారు. ఓటర్లను తమ వైపు ఆకర్శించేలా హామీలు ఇచ్చేందుకు ప్రథ్యర్థులతో పోటీ పడుతున్నారు.
రేవంత్ రెడ్డి గ్రామం ఏకగ్రీవం:
మొదటి విడత ఎన్నికలు జరగాల్సిన పంచాయతీలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఏకగ్రీవాల సందడి నెలకొంది. పలు గ్రామాల్లో సర్పంచ్‍లు, వార్డు మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి సర్పంచ్ పదవి ఏకగ్రీవం అయింది. రేవంత్ రెడ్డి చిన్ననాటి మిత్రుడు, క్లాస్ మేట్ వెంకటయ్య సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. కొండారెడ్డిపల్లిలో సర్పంచ్ స్థానం ఎస్సీకి రిజర్వ్ కాగా మొత్తం 15మంది పోటీ పడ్డారు. ఈ క్రమంలో గ్రామపెద్దలు అంతా కలిసి సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవం చేశారు.
రేపటి నుంచి రెండో విడత నామినేషన్లు:
రేపటి నుంచి రెండో విడత ఎన్నికల కోసం నామినేషన్లు స్వీకరించనున్నారు. రెండో విడతలో నామినేషన్ల స్వీకరణకు డిసెంబర్ 2 వరకు తుది గడువు విధించారు. డిసెంబర్ 3వ తేదీన నామినేషన్ల పరిశీలన, డిసెంబర్ 6న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. అదే రోజున అభ్యర్థుల తుది జాబితా ప్రకటించి వారికి ఎన్నికల గుర్తును కేటాయించనున్నారు. వచ్చే నెల 14న పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితం ప్రకటిస్తారు.






