- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Eatala Rajender: ఇందిరమ్మ ఇండ్ల విస్తీర్ణంలో వెసులుబాటు కల్పించండి.. పొంగులేటితో ఈటల రాజేందర్
ఇందిరమ్మ ఇండ్ల విస్తీర్ణం విషయంలో వెసులుబాటు కల్పించాలని మంత్రి పొంగులేటితో ఈటల రాజేందర్ కోరారు.

దిశ, డైనమిక్ బ్యూరో: నిజమైన పేదవారికే ఇందిరమ్మ ఇండ్లు (Indiramma Indlu) దక్కేలా లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని మాల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని (Ponguleti Srinivas Reddy) కోరారు. ఇవాళ సచివాలయంలో పొంగులేటిని కలిసిన ఈటల తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు, ఇందిరమ్మ ఇండ్ల సమస్యల పరిష్కారం, హూజారాబాద్ నియోజకవర్గంలో గతంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు మౌలిక వసతులు కల్పించాలని వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఈటల.. పెరిగిన ధరల ప్రకారం ప్రభుత్వం ఇస్తున్న రూ. 5 లక్షలకు డబుల్ బెడ్ రూమ్ ఇంటి నిర్మాణం పూర్తి కాదన్నారు. అదనంగా మరో 10 లక్షలు పెట్టుకుంటే తప్ప పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మాణం పూర్తి కావడం లేదన్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలోపే నిర్మించుకోవాలని ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకుండా లబ్ధిదారులకు వెసులుబాటు కల్పించాలని అన్నారు. వాస్తుకోసమో ఇతర విషయాల కోసం కొంత అటుఇటుగా నిర్మాణాలు చేపట్టినా ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరారు. నిజమైన అర్హులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం వద్ద పెద్ద ఇంటలెజెన్స్ వ్యవస్థ ఉందన్నారు. ఒకటికి రెండు సార్లు సంపూర్ణంగా ఎంక్వైయిరీ చేసి వీలైనంత త్వరగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించే ప్రయత్నం చేయాలని కోరామన్నారు. తమ విజ్ఞప్తిపై మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. మల్కాజిగిరి పరిధిలోని జవరహర్ నగర్ లోని భూములకు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. అయినా అక్కడ ప్రభుత్వం అజమాయిషీ చెలాయిస్తోందన్నారు.
యూరియా కొరతకు బీజేపీ కక్ష సాధింపు చర్య అనే ఆరోపణలను ఆయన ఖండించారు. తెలంగాణ సమగ్ర అభివృద్దిలో బీజేపీ ఎంపీల పాత్ర ఉంటుందన్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థికి ఓటు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారని మీడియా అడిగిన ప్రశ్నకు స్పందింస్తూ ప్రజాస్వామ్యంలో ఓటు ఎవరు ఎవరికైనా అడగవచ్చన్నారు. కొన్ని సందర్భాల్లో ప్రత్యర్థి పార్టీ ఇంటికి వెళ్లి మరీ ఓట్లు అడుగుతామన్నారు. ఎవరికి ఓటు వేయబోతున్నారని అడగగా తాను బీజేపీ పార్టీ ఎంపీనని చెప్పారు.






