- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో ఎవరూ ఉండొద్దు.. పార్టీ నేతలకు CM రేవంత్ సంచలన ఆదేశాలు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) పరిధిలో ఉండగానే స్థానిక సంస్థల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదలైంది.

దిశ, వెబ్‌డెస్క్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) పరిధిలో ఉండగానే స్థానిక సంస్థల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, మంత్రులు, జిల్లాల ఇంచార్జ్ మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ జూమ్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలపై అందరూ దృష్టి పెట్టాలన్నారు. ఇంచార్జ్ మంత్రులు ఎట్టి పరిస్థితుల్లో నియోజకవర్గాల్లో ఉండాలని అన్నారు. ఎవరూ హైదరాబాద్ (Hyderabad)లో ఉండొద్దని.. క్షేత్రస్థాయిలో పని చేయాల్సిందేనని రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.
అదేవిధంగా స్థానిక సమస్యలపై దృష్టి పెట్టి అన్ని ప్రాంతాల ఎమ్మెల్మేలతో ఇంచార్జ్ మంత్రులు మాట్లాడాలని రేవంత్ రెడ్డి సూచించారు. నామినేషన్ల విషయంలో ఎవరికైనా సందేహాలు ఉంటే లీగల్ సెల్‌ను కలవాలన్నారు. రిజర్వేషన్లపై కోర్టు వాదనలపై దృష్టి పెట్టాలని తెలిపారు. కోర్టు ఆదేశాలు వచ్చిన వెంటనే కార్యాచారణ ప్రారంభించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అభ్యర్థులను ఖరారు చేసి బీ ఫారం ఇవ్వాలని, నో డ్యూ పత్రాలు ఇప్పించాలని ఆదేశించారు. ఇంచార్జ్ మంత్రులు.. పార్టీ ముఖ్య నేతలతో చర్చించి అభ్యర్థులను ఖరారు చేయాలన్నారు. తొలి విడత కోసం నేటి రాత్రికి అభ్యర్థుల జాబితా సిద్ధం కావాలని తెలిపారు. ఎంపీపీ (MPP), జెడ్పీ చైర్మన్ (ZP Chairman) పదవుల ఎంపికపై.. పీసీసీ చర్చించి తుది నిర్ణయం తీసకుంటుందని, అప్పటి వరకు ఎవరూ రాజకీయ ప్రకటనలు చేయొద్దని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు తెలిపారు.






