అధికారంలో ఉన్నప్పుడు ఎవరూ గుర్తురాలే.. కవితపై బీర్ల ఐలయ్య హాట్ కామెంట్స్

by Kema Shiva Kumar |

ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్నా.. సకలజనులకు, సబ్బండ వర్గాలకు న్యాయం జరిగేలా సామాజిక తెలంగాణను ఇంకా సాధించలేకపోయామని ఎమ్మెల్సీ కవిత చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.

అధికారంలో ఉన్నప్పుడు ఎవరూ గుర్తురాలే.. కవితపై బీర్ల ఐలయ్య హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్నా.. సకలజనులకు, సబ్బండ వర్గాలకు న్యాయం జరిగేలా సామాజిక తెలంగాణను ఇంకా సాధించలేకపోయామని ఎమ్మెల్సీ కవిత చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. బీఆర్ఎస్ పాలనలో ఎకరం భూమి ఉన్న వాళ్లు ఏడాదికి రూ.10 వేలు, పది ఎకరాలు ఉన్నోళ్లకు రూ.లక్ష ఇచ్చామని, భూమి లేనోళ్లకు ఒక్క పైసా ఇవ్వలేకపోయామంటూ కవిత కామెంట్ చేశారు.

అయితే, ఆమె చేసిన వ్యాఖ్యలపై తాజాగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య (Beerla Ilaiah) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పదేళ్ల బీఆర్ఎస్ (BRS) పాలనలో కేసీఆర్ (KCR) రూ.8 లక్షల కోట్ల అప్పలు చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా కోలుకులేని విధంగా దెబ్బ తీశారని ఫైర్ అయ్యారు. అధికారంలో ఉన్న నాడు ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)ji సకలజనులు, సబ్బండ వర్గాలకు ఎందుకు అండగా నిలబడలేదని ప్రశ్నించారు. పవర్ ఉన్న నాడు ఆమెకు ఎవరూ గుర్తు రాలేదని.. అధికారం దూరం అయ్యాక అందరూ గుర్తుకొస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజల బలంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ (Congress Government) బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం చేసిన అప్పులను క్రమంగా తీర్చుతూ.. మరోవైపు సమర్ధవంతంగా రాష్టంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అన్నారు. నేడు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సారథ్యంలో సంక్షేమ ఫలాలు గడపగడపకు చేరుతున్నాయని, తమ అధినేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చెప్పిన విధంగా రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతోందని బీర్ల ఐలయ్య అన్నారు.

Next Story