జూబ్లీహిల్స్‌లో మా గెలుపు‌ను ఎవరూ ఆపలేరు.. మంత్రి శ్రీధర్‌బాబు

by Kema Shiva Kumar |

జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (Sridhar Babu) అన్నారు.

జూబ్లీహిల్స్‌లో మా గెలుపు‌ను ఎవరూ ఆపలేరు.. మంత్రి శ్రీధర్‌బాబు
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (Sridhar Babu) అన్నారు. ఇవాళ ఆయన గాంధీభవన్‌లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాధారణ ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఇచ్చిన వినతులు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్‌లో తమ గెలుపు అప్పుడే ఖారారైందని కామెంట్ చేశారు. తమ గెలుపును ఆపడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. ఇక బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ‘ఓట్ చోరీ’కి పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు.

కర్ణాటక‌ (Karnataka)లో జరిగిన ‘ఓట్ చోరీ’పై రాహుల్‌గాంధీ స్పష్టమైన ఆధారాలు చూపించారని తెలిపారు. అయితే, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా రాష్ట్రంలో కేటీఆర్ తీరు ఉందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల‌కు ముందు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉందని.. ఓటర్ జాబితాలో తప్పిదాలు జరిగాయని చెప్పడం, బీఆర్ఎస్ పార్టీ ‘ఓట్‌ చోరీ’కి పాల్పడినట్లుగా ఒప్పుకోవడమేనని అన్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు చోరీ చేసి గెలిచిందని.. అర్హత లేని విద్యార్థులను ఓటర్లుగా చేర్చారని ఆరోపించారు. ఈ విషయంలో త్వరలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో నవీన్‌యాదవ్ బస్తీ వాసులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాడని తెలిపారు. ఇప్పటికే ఓటమిని గ్రహించి.. ఏదో ఒక కారణాన్ని బీఆర్ఎస్ పార్టీ వెతుకుతోందని శ్రీధర్‌బాబు అన్నారు.

Next Story