- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: గ్యాస్, పెట్రోల్‌పై బిగ్ అప్‌డేట్
తెలంగాణలో పెట్రోల్, డీజిల్ మరియు వంట గ్యాస్ కొరత ఉందంటూ వస్తున్న వార్తలపై సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టత ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పెట్రోల్, డీజిల్ మరియు వంట గ్యాస్ కొరత ఉందంటూ వస్తున్న వార్తలపై సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో సరిపడా నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో రాబోయే 60 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ల సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 484 ట్రక్కుల గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేసినట్లు కమిషనర్ తెలిపారు. డిమాండ్‌కు మించి సరఫరా జరుగుతున్నప్పటికీ, ప్రజలు అవసరానికి మించి బుకింగ్స్ చేయడం వల్ల కొంత ఒత్తిడి పెరుగుతోందని ఆయన వివరించారు. పైపుడ్ నేచురల్ గ్యాస్ (PNG), మరియు వాహనాలకు వాడే CNG సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని స్పష్టం చేశారు.
ప్రత్యేక నిఘా..
పెట్రోల్, డీజిల్ సరఫరాను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. నిల్వలపై నిరంతరం నిఘా ఉంచుతున్నామని ఆయన తెలిపారు. "రాష్ట్రంలో ఇంధన కొరత లేదు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దు. ప్రజలు తమకు అవసరమైన మేరకే ఇంధనాన్ని, సిలిండర్లను తీసుకోవాలి." స్టీఫెన్ రవీంద్ర స్పష్టత ఇచ్చారు.






