- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG High Court: ఇక నుంచి సినిమా థియేటర్లలో వారికి నో ఎంట్రీ
సినిమా టికెట్ల ధరల పెంపు(Increase in movie ticket prices), ప్రత్యేక షో(Special Show)ల అనుమతిపై తెలంగాణ హైకోర్టు(Telangana High Court) మరోసారి విచారించింది.

దిశ, వెబ్‌డెస్క్: సినిమా టికెట్ల ధరల పెంపు(Increase in movie ticket prices), ప్రత్యేక షో(Special Show)ల అనుమతిపై తెలంగాణ హైకోర్టు(Telangana High Court) మరోసారి విచారించింది. విచారణ సందర్భంగా థియేటర్లలోకి చిన్నారుల అనుమతిపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. థియేటర్లలో 16 ఏళ్ల లోపు పిల్లల అనుమతిపై ఆంక్షలు విధించింది. ఉదయం 11 లోపు షోలకు చిన్నారులను అనుమతించొద్దని థియేటర్ యాజమాన్యాలను ఆదేశించింది. వేళపాలలేని షోలకు పిల్లలు వెళ్లడం కరెక్ట్ కాదని పిటిషనర్ పేర్కొన్నారు. పిల్లల ఆరోగ్యంపైనా ప్రభావం పడుతుందని అన్నారు. ఈ సందర్భంగా పిటిషనర్ వాదనను కోర్టు ఏకీభవించింది. తదుపరి విచారణను వచ్చే నెల 22కు వాయిదా వేసింది. కాగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన పుష్ప-2 సినిమా నుంచి టికెట్ల ధరల పెంపు, అదనపు షోల అంశం వివాదాస్పదంగా మారింది.
ఈ అంశంపై పలువురు హైకోర్టు వరకూ వెళ్లడంతో ఇష్యూ సీరియస్ అయింది. ప్రత్యేక ప్రదర్శనలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం(Revanth Reddy Govt) అనుమతి ఇవ్వటంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బెనిఫిట్ షోలు రద్దు చేశామని ప్రకటించిన తర్వాత కూడా ప్రత్యేక షోలకు అనుమతులు ఇవ్వటం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. తెల్లవారుజామున షోలకు అనుమతిపై పునసమీక్షించాలంటూ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తాను హైకోర్టు ఆదేశించింది. భారీ బడ్జెట్‌తో తీసి నిర్మాతలు ప్రేక్షకుల నుంచి డబ్బును వసూలు చేయాలనుకోవడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా చోటు చేసుకున్న ప్రమాదం తర్వాత కూడా బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడం కరెక్ట్ కాదని అభిప్రాయపడింది.






