- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ వాహనాలకు నో ఎంట్రీ.. ఏపీ బోర్డర్ వద్ద హైటెన్షన్!
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఇష్యూతో ఒక్కసారిగా ఏపీ, తెలంగాణల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

X
దిశ, వెబ్‌డెస్క్: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఇష్యూతో ఒక్కసారిగా ఏపీ, తెలంగాణల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బుధవారం అర్ధరాత్రి నుంచి తెలంగాణ పోలీసులు, ఏపీ పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఓ వైపు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా ఏపీ అధికారులు సాగర్ ప్రాజెక్ట్ కుడి కాలువ నుంచి నీటిని విడుదల చేసేందుకు సిద్ధం కావడం కలకలం రేపింది. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో ఏపీ బోర్డర్ దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. నాగార్జున సాగర్, మాచర్ల దారిలో తెలంగాణ నుంచి ఏపీ వైపు వచ్చే వాహనాలను పోలీసులు అనుమతించడం లేదు. ఏపీ అడ్రస్ ఆధార్ కార్డు కలిగి ఉన్న వారిని మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. మిగిలిన వారిని ఏపీ పోలీసులు వెనక్కి పంపిస్తున్నారు.
Next Story






