- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తరగతులు లేవు.. పరీక్షలూ లేవు..! ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ఎవరి పంతం వారిదే
రాష్ట్రంలో కొనసాగుతున్న కాలేజీల బంద్‌కు ఎప్పుడు ఎండ్‌కార్డు పడుతోందనన్న టెన్షన్ మొదలైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కొనసాగుతున్న కాలేజీల బంద్‌కు ఎప్పుడు ఎండ్‌కార్డు పడుతోందనన్న టెన్షన్ మొదలైంది. ఇప్పటికే నాలుగు రోజులుగా డిగ్రీ, ఇంజనీరింగ్, లా, ఫార్మసీ, ఇతర ప్రొఫెషనల్ కాలేజీలు మూతపడ్డాయి. ఫార్మసీ కాలేజీల్లో షెడ్యూలు ప్రకారం నిర్వహించాల్సిన సెమిస్టర్ పరీక్షలను నిర్వహించడం లేదు. అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలు సైతం మిడ్‌టర్మ్ ఎగ్జామ్స్‌ను వాయిదా వేశాయి. దీంతో లక్షలాది మంది స్టూడెంట్స్, వారి పేరెంట్స్ లో ఆందోళన మొదలైంది. ఇలాగే మరి కొన్ని రోజుల పాటు కాలేజీలు ఓపెన్ చేయకపోతే తమ భవిష్యత్ ఏంటీ? అని మధనపడుతున్నారు.
ఎవరి పంతం వాళ్లదే..
ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల చెల్లింపు విషయంలో అటు ప్రభుత్వం, ఇటు కాలేజీల యాజమన్యాలు పట్టు వీడటం లేదు. బకాయిల్లో సగం మొత్తం రూ. 5వేల కోట్లు చెల్లిస్తేనే కాలేజీలను ఓపెన్ చేస్తామని మేనే జ్మెంట్లు మొండికేయగా, త్వరలో కొంత మొత్తా న్ని విడుదల చేస్తామని, ముందు కాలేజీలు ఓపెన్ చేయాలని అధికారులు చెప్తున్నారు. నాలుగు రోజులుగా దాదాపు 1800 కాలేజీలు మూతపడ్డాయి. మంగళవారం నుంచి జరగాల్సిన బీ పార్మసీ రెండో సంవత్సరం వార్సిక పరీక్షలను షెడ్యూలు ప్రకారం నిర్వహించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కానీ మెజార్టీ కాలేజీలు పరీక్షలను నిర్వహించేది లేదని పరీక్షలను బహిష్కరించాయి. అలాగే జెఎన్టీయూ పరిధిలోని మెజారిటీ ఇంజనీరింగ్ కాలేజీల్లో షెడ్యూలు ప్రకారం సోమవారం నుంచి మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ జరగాలి. కానీ ఎగ్జామ్స్ వాయిదా వేస్తున్నట్లు స్టూడెంట్స్ కు మెసేజ్ లు పంపారు.
ఎన్నికల బిజీలో సీఎం, మంత్రులు
ప్రస్తుతం సీఎం, మంత్రులు పూర్తిగా జూబ్లీహిల్స్ ఎన్నికల బిజీలో ఉన్నారు. ఆదివారం సాయంత్రం వరకు వారంత ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో ఉంటారు. ఆ తరువాతనే కాలేజీల ప్రతినిధులతో చర్చలు జరిపే చాన్స్ ఉంది. అయితే ఈ లోపు కాలేజీలతో సంప్రదింపులు జరపాలని అధికారులకు సూచించినట్లు తెలిసింది.
అసలు బకాయిలు ఎన్ని?
రీయింబర్స్ మెంట్ బకాయిల విషయంలో క్లారిటీ లేదు. మొత్తం పదివేల కోట్లు పెండింగ్ లో ఉన్నాయని కాలేజీల యాజమాన్యా లు వాదిస్తున్నాయి. కానీ కేవలం రూ.3.500 కోట్లు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని, అందులో మెజా ర్టీ బిల్లులు పాత ప్రభుత్వానివి అని మంత్రులు చెబుతున్నారు. దీంతో పెండింగ్ అమౌంట్ ఎంత అనే విషయం స్పష్టత రావడం లేదు. కానీ పాత ప్రభుత్వంలో స్టూడెంట్స్ తప్పుడు అటెండెన్స్ సమర్పించి వేలాది కోట్లను దోచుకున్నారని ఫిర్యాదులు రా వడంతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు అదేశించింది. ఆ నివేదిక వచ్చిన తరువాతే పాత బిల్లుల అంశంపై తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఉన్న బకాయిల్లో కొంత మొత్తాన్ని ఇచ్చేందుకు సీఎం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తున్నది.
చరిత్రలో తొలిసారి బంద్
ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ హయాంలో రీయింబర్స్ మెం ట్ స్కీమ్ ప్రారంభమైంది. ఆ తరువాత సీఎంగా పనిచేసిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కొనసాగించా రు. ఎప్పటి బిల్లు లు అప్పుడే రిలీజ్ చేసేవారు. అయి తే రాష్ట్ర ఏర్పాటు తరు వాత కేసీఆర్ సైతం స్కీమ్ ను కొనసాగించారు. కానీ బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం జరిగినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాలేజీల మేనేజ్ మెంట్స్ నోరు విప్పకుండా మౌనంగా భరిం చారు. కాం గ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత యాజమన్యా లు ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించి, చివరికి కాలేజీల బంద్ కొనసాగిస్తున్నాయి.






