- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుడ్ న్యూస్ చెప్పిన ఎన్ఎంసీ.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు పర్మీషన్ గ్రాంటెడ్
తెలంగాణలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ఆందోళన తప్పింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని 26 మెడికల్ కాలేజీలపై జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఆయా కళాశాలల్లో వసతుల లేమిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అధ్యాపకుల కొరత, సరైన హాస్టల్ భవనాలు, క్లినికల్ పారామీటర్లు, ప్రయోగశాలలు, విద్యార్థులు పాఠాలు నేర్చుకునేందుకు సరిపడా మృతదేహాలు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వెనువెంటనే తీసుకుంటున్న చర్యల కారణంగా ఎన్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కాలేజీలకు ఎలాంటి జరిమానా విధించకుండానే ఈ సంవత్సరానికి అనుమతులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ఆందోళన తప్పింది.
అధికారుల డిక్లరేషన్‌తో ముందడుగు..
తెలంగాణలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో నెలకొన్న అధ్యాపకుల కొరత, ల్యాబ్ పరికరాలు ఇతర సౌకర్యాల లేమి కారణంగా నేషనల్ మెడికల్ కమిషన్ రాష్ట్రంలోని పలు ప్రభుత్వ వైద్య కళాశాలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనిపై కీలక సమావేశాలు నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై హెల్త్ మినిస్టర్‌తో పాటు సీఎం రేవంత్ రెడ్డికి దృష్టికి కూడా తీసుకెళ్లారు. దీంతో వెంటనే చర్యలకు ఉపక్రమించిన రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ సెక్రటరీ, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జూన్ 18న ఢిల్లీలో జరిగిన సమావేశంలో డిక్లరేషన్ ద్వారా ప్రభుత్వ వైద్య కళాశాలలో సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగా పెద్ద ఎత్తున పోస్టులు భర్తీ చేస్తూ, మరోవైపు కావాల్సిన అత్యాధునిక పరికరాలకు సైతం అనుమతి ఇవ్వడంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ విషయంలో ప్రపంచ బ్యాంకు నుంచి నుంచి రుణం తీసుకుని సమస్య పరిష్కరిస్తామని పేర్కొన్నారు. దీంతో సంతృప్తి చెందిన నేషనల్ మెడికల్ కమిషన్ ఈ ఏడాదికి గాను కళాశాలలకు ఎలాంటి జరిమానా విధించకుండానే అనుమతులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.






