అసెంబ్లీ ఎప్పుడు పెట్టినా బీఆర్ఎస్ రెడీ: ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్

by Ajay Maddhiboyina |

రాష్ట్ర సమస్యలు, నీళ్లపై కాంగ్రెస్ పార్టీకి అవగాహన లేదని.. అసెంబ్లీ ఎప్పుడు పెట్టినా బీఆర్ఎస్ రెడీగా ఉంటుందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌కుమార్ స్పష్టం చేశారు.

అసెంబ్లీ ఎప్పుడు పెట్టినా బీఆర్ఎస్ రెడీ: ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర సమస్యలు, నీళ్లపై కాంగ్రెస్ పార్టీకి అవగాహన లేదని.. అసెంబ్లీ ఎప్పుడు పెట్టినా బీఆర్ఎస్ రెడీగా ఉంటుందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌కుమార్ స్పష్టం చేశారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రానికి నీళ్లలో జరుగుతున్న అన్యాయంపైనే హరీశ్‌రావు మాట్లాడుతున్నారని.. నీళ్ల అంశం తమ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి మైక్ ఇవ్వాలని.. సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ నుంచి పారిపోవద్దని అన్నారు.

తెలంగాణ, ఏపీ అసెంబ్లీలు కలిపి పెట్టినా నీళ్ల గురించి వాళ్లకు అవగాహన కల్పిస్తామన్నారు. తెలంగాణలో విచిత్ర పరిస్థితి ఉందని.. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ఏకమై బీఆర్ఎస్ పార్టీపైన దాడి చేస్తున్నాయని అన్నారు. రాష్ట్రంపై చంద్రబాబు మోసపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబునాయుడు, శిష్యుడు రేవంత్‌రెడ్డి అబద్ధాల్లో పెద్దన్నలుగా మారారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి చంద్రబాబుపై కాకుండా బీఆర్ఎస్‌పై యుద్ధం చేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పాల్గొన్నారు.

Next Story