మొబైల్ ఫోన్ తెచ్చిన తంటా.. తండ్రి మందలించాడని కొడుకు ఆత్మ హత్య

by Bhanu |

మొబైల్ ఫోన్ తెచ్చిన తంటా తండ్రి, కొడుకుల మధ్య చిచ్చుపెట్టి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది

మొబైల్ ఫోన్ తెచ్చిన తంటా.. తండ్రి మందలించాడని కొడుకు ఆత్మ హత్య
X

దిశ, నిజాంసాగర్ : మొబైల్ ఫోన్ తెచ్చిన తంటా తండ్రి, కొడుకుల మధ్య చిచ్చుపెట్టి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని చిన్న ఆరేపల్లి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం నిజాంసాగర్ మండలంలోని చిన్న ఆరేపల్లి గ్రామానికి చెందిన కొంకుల గంగారం తన కుమారుడు కొంకుల రాకేష్ (20) అనే యువకుడు తరచుగా ఫోన్ లో మాట్లాడుతున్నాడని గమనించి తండ్రి గంగారాం మందలించాడు. దీంతో తండ్రి మందలించడాన్ని జీర్ణించుకోలేని రాకేష్ తీవ్ర మనస్తాపం చెంది సోమవారం ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మ హత్యా చేసుకున్నట్లు తెలిపారు. మృతుడి తండ్రి కొంకుల గంగారం పిర్యాదు మేరకు శవ పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

Next Story