- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పండగపూట విషాదం..
by Batti.Sumithra |
రోజు మాదిరిగానే పొలంలో పనులకు వెళ్లిన ఓ యువ రైతు ప్రమాదవశాత్తు పొలంలో జారిపడి మృతి చెందిన సంఘటన కామారెడ్డి మండలం అడ్డూర్ లో చోటు చేసుకుంది.

X
దిశ, కామారెడ్డి రూరల్ : రోజు మాదిరిగానే పొలంలో పనులకు వెళ్లిన ఓ యువ రైతు ప్రమాదవశాత్తు పొలంలో జారిపడి మృతి చెందిన సంఘటన కామారెడ్డి మండలం అడ్డూర్ లో చోటు చేసుకుంది. దేవునిపల్లి పోలీసులు, గ్రామస్తుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఒడిశెట్టి కృష్ణ (35) అనే యువ రైతు వరి పొలంలో పని చేయడానికి వెళ్లాడు.
పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు పొలంలో జారిపడి అక్కడికక్కడ మృతి చెందాడని తెలిపారు. బతుకమ్మ పండుగ రోజు మృతి చెందడంతో కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
Next Story






