- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
నిజామాబాద్ నగరంలోని రైల్వే కమాన్ సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం

దిశ, నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ నగరంలోని రైల్వే కమాన్ సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. నగరంలోని వీక్లీ బజార్ కు చెందిన సంతోష్ (36) అనే యువకుడు కంఠేశ్వర్ వైపు నుండి రైల్వే కమాన్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ వైపుకు బైకుపై వెళుతుండా ఈ ప్రమాదం జరిగింది. తనకు ముందుగా వెళుతున్న ఓ ప్రైవేట్ బస్సు సడన్ బ్రేక్ వేయడంతో, బైక్ పై వెళుతున్న సంతోష్ అదుపు తప్పి వెనుక నుంచి తను నడుపుతున్న బైక్ తో బస్సును ఢీకొట్టాడు.
అదే సమయంలో వెనక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు సంతోష్ నడుపుతున్న బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంతోష్ తీవ్రంగా రక్తస్రావం కావడంతో స్థానికులు స్పందించి 108 అంబులెన్సులో జీజీహెచ్ కు తరలించారు. కానీ, అప్పటికే సంతోష్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు సంతోష్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాడని తెలిసింది. ఉపాధి కోసం నిజామాబాద్ కు వచ్చి ఇక్కడ సివిల్ వర్క్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






