గుండెపోటుతో యువ‌ న్యాయ‌వాది మృతి

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, గాంధారి : గుండెపోటు తో యువ న్యాయ‌వాధి మృతి చెందిన ఘ‌ట‌న గాంధారి మండ‌ల కేంద్రంలో చోటు చేసుకుంది. మండ‌ల కేంద్రానికి చెందిన సామ సుధీర్(31) న్యాయ‌వాది

గుండెపోటుతో యువ‌ న్యాయ‌వాది మృతి
X

దిశ‌, గాంధారి : గుండెపోటు తో యువ న్యాయ‌వాధి మృతి చెందిన ఘ‌ట‌న గాంధారి మండ‌ల కేంద్రంలో చోటు చేసుకుంది. మండ‌ల కేంద్రానికి చెందిన సామ సుధీర్(31) న్యాయ‌వాది అక‌స్మాత్తుగా మ‌ర‌ణించాడు. ఉద‌యం నిద్ర లేవ‌గానే బ్ర‌ష్ చేసుకుంటూ అక్క‌డిక‌క్క‌డే కింద ప‌డిపోవ‌డంతో హుటాహుటిన అత‌న్ని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అప్ప‌టికే గుండెపోటుతో మృతి చెందిన‌ట్టు వైద్యులు ధృవీక‌రించారు. సుధీర్ త‌న న్యాయవాద చ‌దువును ముగించుకొని మండ‌ల కేంద్రంలో ఉన్న ప్ర‌జ‌లకు అందుబాటులో ఉంటూ న్యాయ‌ప‌రంగా గ్రామ‌స్తుల‌కు ప‌లు సూచ‌న‌లు చేస్తూ అంద‌రికి చేదోడువాదోడుగా ఉండేవాడ‌ని గ్రామ‌స్తులు చ‌ర్చించుకుంటున్నారు. మృతుడికి భార్య‌, 6 నెల‌ల బాబుతో పాటు త‌ల్లి ఉన్నారు. ఈ యువ న్యాయ‌వాది మృతితో గ్రామంలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.

Next Story