- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
యుద్ధ ప్రాతిపదికన రోడ్డు మరమ్మత్తు పనులు చేయించి, కాలనీకి రవాణా సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు.

దిశ, భిక్కనూరు: యుద్ధ ప్రాతిపదికన రోడ్డు మరమ్మత్తు పనులు చేయించి, కాలనీకి రవాణా సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నాడు ఆయన భిక్కనూరు మండల కేంద్రంలోని దాసనమ్మకుంట ద్వారా, కొత్త( గిద్ద) దళితవాడకు వెళ్లే తెగిపోయిన బీటీ రోడ్డును పరిశీలించారు. సుమారు 600 మంది జనాభా ఉన్న ఆ కాలనీకి, రాకపోకలు నిలిచిపోవడం వలన ప్రజలు తాగునీటితోపాటు ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాలనీవాసులతోపాటు, వివిధ పార్టీల నాయకులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే అధికారులను పిలిచి తక్షణమే పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పనుల ప్రోగ్రెస్‌కు సంబంధించి రిపోర్టులు ఎప్పటికప్పుడు పంపించాలని ఆదేశించారు. అనంతరం అక్కడి నుంచి దక్షిణ కాశీ సిద్ధ రామేశ్వరాలయానికి వెళ్లే దెబ్బతిన్న రోడ్డు దగ్గరకు వెళ్లి పరిశీలించారు.
అయితే పీతి రాగు కాలువ శుభ్రం చేయించకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని పలువురు బాధిత రైతులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. మా కాలనీకి రాకపోకలు నిలిచిపోయి మూడు రోజులవుతున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారని గిద్ద దళితవాడ వాసులు కలెక్టర్‌కు మొర పెట్టుకున్నారు. దీంతో వెంటనే తహసిల్దార్ సునీత, ఎంపీడీఓ రాజ్ కిరణ్ రెడ్డిని పిలిచి వారికి కావలసిన సదుపాయాలు కల్పించాలని వారిని ఆదేశించారు. ఆయన వెంట గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్, తహసిల్దార్ సునీత, ఎంపీడీఓ రాజ్ కిరణ్ రెడ్డి, పి ఆర్ ఏ ఈ దుర్గాప్రసాద్, డిప్యూటీఈఈ స్వామి దాస్, గ్రామపంచాయతీ ఈ ఓ మహేష్ గౌడ్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బల్యాల సుదర్శన్, మాజీ సర్పంచ్ తునికి వేణు, సొసైటీ చైర్మన్ గంగల భూమయ్య, పి జ్ఞాన ప్రకాష్ రెడ్డి, తాటిపాముల లింబాద్రి, అందె దయాకర్ రెడ్డి, పొట్టి గిని శంకర్, పొట్టి గిని లక్ష్మణ్, పి జనార్దన్ రెడ్డి, తాటిపాముల విజయ్ కుమార్ గౌడ్, సరస్వతి ప్రభాకర్, తదితరులు ఉన్నారు.






