అడ్వ‌కేట్ సాయి కృష్ణారెడ్డికి వండ‌ర్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డు

by Ratna Kumari |   (  Updated:2025-10-19 14:12:07  IST  )

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిప‌ల్ కేంద్రంలోని పుణ్య‌క్షేత్ర‌మైన న‌వ‌నాథ సిద్ధుల గుట్ట వ‌ద్ద నిర్మించిన తెలంగాణ రెండో అతిపెద్ద సిద్దేశ్వ‌ర పిర‌మిడ్ ధ్యాన మందిరం వ‌ద్ద

అడ్వ‌కేట్ సాయి కృష్ణారెడ్డికి వండ‌ర్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డు
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిప‌ల్ కేంద్రంలోని పుణ్య‌క్షేత్ర‌మైన న‌వ‌నాథ సిద్ధుల గుట్ట వ‌ద్ద నిర్మించిన తెలంగాణ రెండో అతిపెద్ద సిద్దేశ్వ‌ర పిర‌మిడ్ ధ్యాన మందిరం వ‌ద్ద ప‌త్రీజీ ధ్యాన య‌జ్ఞం మ‌న పిర‌మిడ్ బాధ్య‌త 108 రోజులు, 108 గ్రామాలు ధ్యాన కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించిన పీఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్య‌క్షులు అడ్వ‌కేట్ సాయి కృష్ణారెడ్డికి వండ‌ర్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డు ల‌భించింది. అత్యంత ఘ‌నంగా నిర్వ‌హించి ప్ర‌తీ రోజూ మూడు గంట‌లు ధ్యానం చేసి ధ్యానం గురించి అద్భుతంగా వివ‌రిస్తున్నారు. ముఖ్యంగా సిద్దేశ్వర పిరమిడ్ లో 108 రోజులు 108 గ్రామాల ధ్యానజ్ఞాన కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించినందుకు వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ ఇంటర్నేషనల్ వారు గుర్తించారు. అవార్డుతో పాటు గోల్డ్ మెడ‌ల్ మెమొంటో ఆదివారం అంద‌జేశారు. శాఖ‌హారం గురించి నిస్వార్థంగా స్వ‌చ్ఛందంగా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించినందుకు ఈ అవార్డును, గోల్డ్ మెడ‌ల్ ని అంద‌జేసిన‌ట్టు వండ‌ర్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ ఇంట‌ర్నేష‌న‌ల్ కో ఆర్డినేట‌ర్ బింగి న‌రేంద‌ర్, తెలంగాణ కో ఆర్డినేట‌ర్ వాల్గోట్ తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో మహేశ్వర మహా పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, ఆర్మూర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెంకటేశ్వర్ రెడ్డి, ప్రముఖ న్యాయవాది తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు ఏం రాజేందర్ రెడ్డి, మహేశ్వర మహా పిరమిడ్ ట్రస్టు సభ్యులు దామోదర్ రెడ్డి, లక్ష్మీ, ధ్యాన జగత్ మాస పత్రిక ఎడిటర్ కేశవరాజు, సిద్దేశ్వర పిరమిడ్ చైర్మన్ ఏనుగు తిరుమల గంగారం పాల్గొన్నారు.

Next Story