ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి మ‌హిళా ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

by Ratna Kumari |

కుటుంబ సమస్యలతో విసిగి పోయిన ఓ మహిళా తన ఇద్దరు ఆడపిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా గుర్తించిన పోలీసులు వెంటనే అడ్డుకొని వారి ప్రాణాలను కాపాడారు.

ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి మ‌హిళా ఆత్మ‌హ‌త్యాయ‌త్నం
X

దిశ, కామారెడ్డి : కుటుంబ సమస్యలతో విసిగి పోయిన ఓ మహిళా తన ఇద్దరు ఆడపిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా గుర్తించిన పోలీసులు వెంటనే అడ్డుకొని వారి ప్రాణాలను కాపాడారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగాపూర్ గ్రామానికి చెందిన చింతపాటి శోభ (38) అనే మహిళ కామారెడ్డి పట్టణంలోని రైల్వే గేట్ సమీపంలో గల తాహెర్ గార్డెన్ వెనకాల రైల్వే ట్రాక్ పై శుక్రవారం సాయంత్రం ఇద్దరు కూతుళ్లతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా గమనించిన పట్టణ పోలీస్ కానిస్టేబుల్స్ రామకృష్ణ, నర్సింహులు ఆమె ప్రయత్నాన్ని అడ్డుకొని నచ్చజెప్పారు. దీంతో వారి ప్రాణాలను రక్షించడంతో చుట్టుపక్కల వారు పోలీసులను అభినందించారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర కానిస్టేబుళ్లను అభినందించారు.

Next Story