- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ వర్షంతో.. నేలరాలిన వరి ధాన్యం
by Vinod kumar |
కామారెడ్డి జిల్లాలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.

X
దిశ, కామారెడ్డి రూరల్: కామారెడ్డి జిల్లాలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి చేతికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. దీంతో వరి ధాన్యం నేల రాలిపోయింది. జిల్లాలోని లింగంపేట మండలంలో అత్యధికంగా 55.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా.. అత్యల్పంగా మద్నూరు మండలంలో 1.0 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు.
కామారెడ్డి మండలంలోని కొట్టాలపల్లి గ్రామంలో కురిసిన రాళ్ల వర్షానికి వరి పంట పూర్తిగా దెబ్బతింది. అంతేకాకుండా పలు మండలాల్లోని వరి పంటలు కూడా రాళ్ల వర్షానికి దెబ్బతిన్నాయి. వరి ధాన్యం నేల రాలిపోయి ఆర్థికంగా నష్టపోయిన రైతన్నను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని రైతుల కోరుతున్నారు.
Next Story






