పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తా : మాజీ ఎంపీపీ బైండ్ల సుదర్శన్

by Ratna Kumari |

పాఠశాల అభివృద్ధికి తన వంతు సహాయ, సహకారాలు అందిస్తానని మాజీ ఎంపీపీ అధ్యక్షులు బైండ్ల సుదర్శన్ అన్నారు.

పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తా :  మాజీ ఎంపీపీ బైండ్ల సుదర్శన్
X

దిశ, భిక్కనూరు : పాఠశాల అభివృద్ధికి తన వంతు సహాయ, సహకారాలు అందిస్తానని మాజీ ఎంపీపీ అధ్యక్షులు బైండ్ల సుదర్శన్ అన్నారు. సోమవారం భిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ‌తంలో రూ.60వేల వ్య‌యంతో పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో స‌ర‌స్వ‌తి విగ్ర‌హం ఏర్పాటు చేసిన‌ట్టు గుర్తు చేశారు. రూ.2ల‌క్ష‌ల విరాళంతో పాఠ‌శాల‌లో వేదిక నిర్మాణం చేప‌ట్టిన‌ట్టు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నానన్నారు. పాఠశాల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాలమాకుల జ్యోతి సంతోష్ గౌడ్, ఉపసర్పంచ్ బైండ్ల దశరథం, మాజీ సర్పంచులు తొగరి సులోచన, బైండ్ల భూపతి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శైలజ పాల్గొన్నారు.

Next Story