భార్య అక్రమ సంబంధం భర్త చావుకు కారణం

by Naveena |

భార్య అక్రమ సంబంధమే భర్త చావుకు కారణమైన ఘటన ఎల్లారెడ్డి పట్టణంలో చోటు చేసుకుంది.

భార్య అక్రమ సంబంధం భర్త చావుకు కారణం
X

దిశ, ఎల్లారెడ్డి : భార్య అక్రమ సంబంధమే భర్త చావుకు కారణమైన ఘటన ఎల్లారెడ్డి పట్టణంలో చోటు చేసుకుంది. ఎల్లారెడ్డి పట్టణంలో మంగళవారం స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన మ్యాతరి, సతీష్ ( 42) అతనికి 17 సంవత్సరాల క్రితం గాంధారి మండలం గౌరారం గ్రామానికి చెందిన ఆనితతో పెళ్లయింది. వీరిద్దరికీ ఇద్దరు కుమారులు ఉన్నారు. సతీష్ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

ఎల్లారెడ్డి పట్టణంలో నూతనంగా పేదలకు అందించిన రెండు పడక గదుల ఇల్లు రావడంతో భార్య పిల్లలతో గృహప్రవేశం చేసుకొని అక్కడే నివాసం ఉంటున్నాడు. సతీష్ భార్య అనిత వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో మార్చి మూడో తేదీ రాత్రి సమయంలో భార్యాభర్తల మధ్య పెద్దగా తగాదా రావడంతో.. మనస్థాపానికి గురైన సతీష్, తన ఇంటి సమీపంలో ఉన్న కోళ్ల ఫారం వద్ద ఉన్న చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందినట్లు గ్రామస్తులు పోలీసులకు తెలిపినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం ఉదయం సతీష్ మృతిదేహాన్ని గమనించిన గ్రామస్తులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు, సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలంకు చేరుకొని, మృతుడి, తల్లి మ్యాతరి పద్మ తన కుమారుడి మృతిపై అనుమానం ఉన్నట్లు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story