- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కడుదయనీయం... కిడ్నీలు ఫెయిల్.. సాయం కోసం ఎదురుచూపు..
దిశ, ఆర్మూర్ : సాధారణంగా ఎవరికైనా ఒక కిడ్నీ ఫెయిల్ అయిందంటేనే వాళ్లు చాలా ఆందోళన చెందుతుంటారు. వామ్మో కిడ్ని ఫెయిల్ అయిందా..? అని చర్చించుకుంటూ ఉంటారు.

దిశ, ఆర్మూర్ : సాధారణంగా ఎవరికైనా ఒక కిడ్నీ ఫెయిల్ అయిందంటేనే వాళ్లు చాలా ఆందోళన చెందుతుంటారు. వామ్మో కిడ్ని ఫెయిల్ అయిందా..? అని చర్చించుకుంటూ ఉంటారు. కానీ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో నివసించే దేదావత్ శాంతి లాల్ కి రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. దీంతో కడుదయనీయ పరిస్థితిలో ఉంది ఆ కుటుంబం. శాంతిలాల్ భార్య కళ్యాణి తమకు ప్రభుత్వం సాయం చేయాలని కోరుకుంటుంది. గత రెండేళ్ల నుంచి ఆసుపత్రికి వెళ్తున్నట్టు ఆమె తెలిపారు. హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ భర్త శాంతిలాల్ ని చూపిస్తున్నట్టు వెల్లడించింది. దాదాపు ఇప్పటివరకు రూ.5లక్షల వరకు ఖర్చు అయ్యాయని.. ఆ నిరుపేద కుటుంబ ఆడదిక్కు కళ్యాణి వాపోయింది.
కేవలం రూ.15వేల జీతంతో ఆర్మూర్ పట్టణ హెడ్ పోస్ట్ ఆఫీస్ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్నానని.. ఆర్థిక పరిస్తితి బాగాలేదని ఆవేదన వ్యక్తం చేసింది కళ్యాణి. తనకు అమ్మ, అన్న చనిపోయారని.. ఆరు సంవత్సరాల బాబు ఉన్నాడని.. ఎలాంటి ఆధారం లేదని వాపోయింది. ప్రస్తుతం ఆర్మూర్ పట్టణ ఏరియా ఆసుపత్రిలో ఒకరోజు తప్పించి మరోరోజు శాంతిలాల్ కి డయాలసిస్ చేస్తున్నారని తెలిపింది. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి తమకు సహకరించాలని వేడుకుంది. సహాయం చేయదలిచిన వారు 9121744642 నెంబర్ కు ఫోన్ పే చేయవచ్చని కోరారు. మాకు సాయం చేసి మా భర్త ప్రాణాలు రక్షించాలని వేడుకొంది కళ్యాణి.






