దిశ క‌థ‌నానికి స్పంద‌న.. అక్రమంగా విద్యుత్ వాడకంపై సెస్ అధికారుల కొరడా..!

by Ratna Kumari |   (  Updated:2026-01-20 15:49:33  IST  )

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ కేశవ పెరుమళ్ళ స్వామి గుట్ట దగ్గర గల ఓ విద్యుత్ ట్రాన్స్ ఫార్మ‌ర్ కు యదేచ్చగా ఆక్రమంగా విద్యుత్ వినియోగించుకుంటూ ఒక వ్యక్తిగత కొంతకాలంగా బండరాళ్లు పేల్చడం కోసం వినియోగిస్తున్నాడు.

దిశ క‌థ‌నానికి స్పంద‌న..  అక్రమంగా విద్యుత్ వాడకంపై సెస్ అధికారుల కొరడా..!
X

దిశ, ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ కేశవ పెరుమళ్ళ స్వామి గుట్ట దగ్గర గల ఓ విద్యుత్ ట్రాన్స్ ఫార్మ‌ర్ కు యదేచ్చగా ఆక్రమంగా విద్యుత్ వినియోగించుకుంటూ ఒక వ్యక్తిగత కొంతకాలంగా బండరాళ్లు పేల్చడం కోసం వినియోగిస్తున్నాడు. ఆక్రమంగా విద్యుత్తు వాడకం.. చోద్యం చూస్తున్న సెస్ అధికారులు అనే శీర్షికతో దిశ తెలుగు దినపత్రిక లో జనవరి 17న‌ ప్రచురితమైంది. వార్తకు స్పందించి బండరాళ్ల బ్లాస్టింగ్ కు వినియోగిస్తున్న స్థలాన్ని సెస్ విజిలెన్స్ ఏడి మల్లయ్య ఆధ్వర్యంలో సెస్ విజిలెన్స్ అధికారుల బృందం దాడులు జరిపి కేసు నమోదు చేశారు. సెస్ అధికారులు మంగళవారం దాడులు జరిపి పేలుళ్లకు ఉపయోగిస్తున్న విద్యుత్ వైర్లను, స్విచ్ బోర్డులను స్వాధీనం చేసుకొన్నారు. అలీ అనే యజమాని పై కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ ఏడి మల్లయ్య తెలిపారు. ఈ దాడుల్లో సెస్ విజిలెన్స్ ఏడి మల్లయ్యతో పాటు సెస్ విజిలెన్స్ ఏఈ అమూల్య, ఎల్లారెడ్డిపేట సెస్ ఏఈ పృథ్వీదర్ గౌడ్ ఉన్నారు.

సెస్ అధికారుల అండ‌దండ‌లు..

ఎల్లారెడ్డిపేట మండ‌ల కేంద్రంలో పచ్చని పంట పొలాల మధ్య బండరాల్ల బ్లాస్టింగ్ కు సెస్ హెల్పర్ల అండదండలున్నట్లు అట్టి అక్రమ కనెక్షన్ ను సెస్ హెల్పర్లు ప్రోత్సహించినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. అక్రమ విద్యుత్ వినియోగిస్తూ సెస్ కు లక్షల రూపాయల ఆదాయం కు గండి పడింది. మున్ముందు ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సెస్ ఏ ఈ పృథ్వీ దర్ గౌడ్ పేర్కొన్నారు.

Next Story