రాబోయే ఎన్నికలలో ఏ పార్టీకి ఓటు వేస్తారు...

by Disha Web Desk 20 |
రాబోయే ఎన్నికలలో ఏ పార్టీకి ఓటు వేస్తారు...
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : హలో మేము హైద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నాం.. మీరు రాబోయే ఎన్నికలలో ఏ పార్టికి ఓటు వేస్తారు.. అంటూ టేలికాలర్ ల పోన్ ల రింగింగ్ సౌండ్ పెరిగిపోయింది. ఉమ్మడి జిల్లాలో అభ్యర్థులు ఎవరని అడగకుండానే కేవలం పార్టీ ఆధారంగా ఓటర్ నాడిని పట్టుకునే సర్వే జరుగుతుంది. నిజామాబాద్ జిల్లాలో సర్వేల కాలం నడుస్తుంది. ఈ ఏడాది ఖచ్చితంగా ఎన్నికలు ఉంటాయని బీఆర్ఎస్ అదినేత, సీఎం కేసీఆర్ వెల్లడించిన నేపథ్యంలో సర్వేలలో ఎవ్వరి జాతకాలు ఎలా ఉంటాయో అనే సందేహలు లీడర్ లలో ఉన్నది. ముఖ్యంగా అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకైతే సీఎం చేపట్టిన సర్వేలో పలువురు ఎమ్మెల్యేలకు పార్టీ టికేట్ లు గల్లంతు అంటు లీక్ లు వచ్చిన నాటి నుంచి దడ మొదలైంది.

ఇప్పటికే సీఎం కేసిఆర్ తన ప్రభుత్వంలోని ఎమ్మెల్యేల పని తీరుపై సర్వేల పై సర్వేలు చేసుకోని వాటి రిపోర్టుల అధారంగా ఇటివల జరిగిన పార్టి ప్లీనరిలతో పాటు పలు సందర్బాలలో పలువురు ఎమ్మెల్యేలకు వార్నింగ్ లు ఇచ్చినా పద్దతులు మార్చుకోవాలని లేకపోతే టికేట్ గోవిందా అంటు చాల మందికి వార్నింగ్ ఇచ్చాడని వినికిడి. సీఎం కేసిఆర్ సర్వేల కంటే ముందుగానే ఎమ్మెల్యేలు కుడా తమ సొంతంగా తమ గురించి ఓటర్లు ఏమనుకుంటున్నారో అని రహస్యంగా సర్వేలను చేసుకోని వాటి అధారంగా ప్రజల్లోకి వేళ్లేందుకు కసరత్తు చేస్తున్నారు. తాజాగా ఒక సర్వే నిజామాబాద్ జిల్లాలో అధికార పార్టీ నేతలను భయపెడుతుంది. అ సర్వేలో క్యాండిడేట్ లను పక్కన పెట్టి రానున్న ఎన్నికలలో ఏ పార్టీకి ఓటు వేస్తారని సర్వే నిర్వహిస్తుండటంతో పలువురు నాయకుల్లో కొత్తగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ లో అసెంబ్లి సెగ్మెంట్ పరిధిలో జరుగుతున్న సర్వే కావడం లీడర్లతో పాటు క్యాడర్ లోను కొత్త సర్వేపై చెవులు కొరుక్కుంటున్నారు.

నిజామాబాద్ జిల్లాలో తోమ్మది నియోజకవర్గాలతో పాటు జగిత్యాల జిల్లాలో రెండు నియోజకవర్గాల పరిధిలో ఈ సర్వే జరుగుతుండటం విశేషం. ప్రస్తుత నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ సర్వేను చేయిస్తున్నారని వినికిడి. బీఆర్ఎస్ సిట్టింగ్ లపై వ్యతిరేకత ఎంత, అనుకులత ఎంతా అని తెలుసుకోవడం కోసం క్యాండిడేట్ ల పేరు ప్రస్తావించకుండా ఏ పార్టికి ఓటు వేస్తారని క్షేత్రస్థాయిలో ఈ సర్వే చేపట్టినట్లు సమాచారం. సంబందిత సర్వే అధారంగా రాబోయే ఎన్నికలలో సిట్టింగ్ లకు టికేట్ లు ఇవ్వడం, ఇవ్వకపోవడం కు సంబంధం లేదని కేవలం జిల్లాలో ఉన్న రాజకీయ పరిస్థితులు, పార్టీ స్థితిగతుల సర్వే కోసం అని చర్చ జరుగుతుంది. సర్వే కోసం కవిత ప్రత్యేక టీంలను నియమించినట్లు తెలుస్తుంది. ఎన్నికలు వచ్చే వరకు కుడా సంబంధిత టిం సర్వే చేసి ఎప్పటికప్పుడు మారుతున్న సమీకరణలు, ఓటరు నాడి గురించి రిపోర్టుల కోసం సర్వే జరుగుతుందని అంటున్నారు. అయితే సర్వేను మాత్రం అధికార పార్టీ నేతలు ఆషామాషిగా తీసుకోవడం లేదు. సర్వే జరుగుతున్న తీరు, అందులోని ఫలితాల పర్యావసనం ఏమిటని వారిలో గుబులు పట్టుకుంది.

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కల్వకుంట్ల కవిత చేయిస్తున్న సర్వేపై బిన్నబిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎమ్మెల్సీ గా కవిత పదవి కాలం మరో నాలుగు సంవత్సరాలు ఉండటం.. ఇటివల నిజామాబాద్ ఎంపి అరవింద్ ను ఉద్ధేశించి కవిత వెంటాడి ఓడిస్తానని శపథం చేయడం లాంటివి పరిగణలోకి తీసుకోని పార్లమెంట్ పోటికి లైన్ క్లీయర్ చేసుకుంటున్నారా అనే సంశయం వ్యక్తం అవుతుంది. దానికి తోడు 2019 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో తన ఓటమికి కారకులైనా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, అనుకూలతను తెలుసుకునేందుకు అనే వాదనలు లేకపోలేదు. ప్రస్తుతం పరిస్థితిలో కవిత అసెంబ్లికి పోటి చేయరని సీఎం కేసిఆర్ తో దేశ రాజకీయాలలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతున్న ప్రత్యక్ష ఎన్నికలలో పోటి చేయరని పార్టి వర్గాలే చెబుతున్నాయి. ఇదిలాఉండగా ఇటివల నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిదిలో కవిత యాక్టివిటి పెరిగిందని చెప్పాలి.

ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహరం నేపథ్యంలో కవిత పేరు ప్రముఖంగా వినబడడంతో జిల్లలో ఆమె పర్యటన చాలా తగ్గిపోయాయి. మళ్లీ ఇటీవల పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి మొదలుకుని నిజామాబాద్ జిల్లాలో కవిత తన యాక్టివిటిని పెంచారు. ఇటివల నిజామాబాద్ అర్బన్ లో రెడ్డి సామాజీక వర్గం నేతలతో ఎమ్మెల్సీ కవిత ఒక్కరే భేటీ కావడం ప్రాధాన్యాత సంతరించుకుంది. ఏకంగా లోకల్ ఎమ్మెల్యేను రావద్దని ఆ సమావేశంలో సంబంధిత సామాజీక వర్గం నేతలో ఏం మాట్లాడారో తెలియక సతమతమౌతున్నారు. అర్బన్ లో ఒక డివిజన్ లో తాగు నీటి సమస్యపై కొందరు మహిళలు నేరుగా ఎమ్మెల్సీ కవితకు ఫిర్యాదు చేయడంతో కమీషనర్ తో సమస్య పరిష్కరించడం పై అర్బన్ లో కొత్త చర్చ ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ కవిత చేయిస్తున్న సర్వే పార్టీ పరిస్థితులతో పాటు తాను ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయవచ్చో తెలుసుకునేందుకే అని వాదనలు కూడా వినిపిస్తున్నాయి.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed