- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వడ్డీకి ఇచ్చుకునే బదులు.. వాటిపై పెట్టుబడులు పెడితే డబుల్ ధమాకా!?
గోల్డ్ సిల్వర్ ధరలు.. ఊహించని విధంగా పైపైకి పోతుండడం పేద సామాన్యులను ఆందోళనకు గురి చేస్తోంది.

దిశ, భిక్కనూరు: గోల్డ్ సిల్వర్ ధరలు.. ఊహించని విధంగా పైపైకి పోతుండడం పేద సామాన్యులను ఆందోళనకు గురి చేస్తోంది. తులం బంగారం ధర, లక్ష రూపాయలు దాటి సుమారు లక్షా 25 వేల రూపాయలకు చేరుకోవడం, ఇన్వెస్టర్ల తో పాటు, సమయానికి చేతిలో క్యాష్ ఉన్న ఉన్న ప్రతి ఒక్కరూ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతూ అధిక లాభాలు గడిస్తున్నారు. దీంతో ఊళ్ళలో వడ్డీకి డబ్బులు దొరకడం గగనంగా మారడంతో, బ్యాంకులో తాకట్టు పెట్టిన గోల్డ్ లోన్ రెన్యువల్ చేయించుకునే వారితో పాటు, నెల నెలా ఈ ఎం ఐలు కట్టుకునేవారు, అవసరానికి వడ్డీకి క్యాష్ దొరకక పరేషాన్ అవుతున్నారు.
ఎప్పటి మాదిరిగానే అవసరం కోసం వ్యాపారుల వద్దకు వెళ్లి, మిత్తికి డబ్బులు కావాలని అడిగితే, వ్యాపారులు మాత్రం ఇప్పుడైతే పొజిషన్ టైట్ గా ఉంది, వడ్డీకి డబ్బులు దొరకడం కష్టమేనని చెబుతుండడంతో ఒక్కసారిగా షాక్ కు గురవుతున్నారు. ఇన్ని సంవత్సరాలుగా మీ వద్ద డబ్బులు మిత్తికి తీసుకున్నా.. ఎప్పుడైనా సతాయించిన నా..? చెప్పిన టైం కు ఒకరోజు వెనక ముందు డబ్బు సర్దుబాటు చేసి వడ్డీతో సహా కట్టేశానంటూ, ప్రస్తుతం అర్జెంటు డబ్బులు అవసరం ఉండే మీ వద్దకు వచ్చామంటూ తమ బాధను వారి ముందు వెళ్లగక్కుతున్నారు.
అయినా కొందరు వడ్డీ వ్యాపారులు నేను బయటకు ఇచ్చిన పద్దులు సమయానికి రాక చేయి తిరగడం లేదని, రెండు మూడు రోజుల్లో కొన్ని పద్దులు( మిత్తికిచ్చిన డబ్బులు) వచ్చేటివి ఉన్నాయని, అవి రాగానే ఖచ్చితంగా ఇస్తానంటూ నచ్చజెప్పి పంపించేస్తున్నారు. ఇంకొందరేమో వడ్డీకి డబ్బులు ఇచ్చే బదులు గోల్డ్ సిల్వర్ పై, ఇన్వెస్ట్ చేస్తే చూస్తుండగానే పెట్టిన పెట్టుబడి డబుల్ వస్తుందని, అందుకే డబ్బులు తమ వద్ద నిల్వ ఉంచుకోవడం లేదంటూ, ఇప్పుడైతే వడ్డీకి డబ్బులు ఇవ్వడం కుదరదని, కాదని చెప్పి వెనక్కి పంపించేస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో సమయానికి ఈఎంఐలు చెల్లించలేక, బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారాన్ని రెన్యువల్ చేయించుకునేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు. తెలిసిన వారిని ఎవరినైనా కనీసం రెండు మూడు రోజుల కోసం చే బదులు అడిగిన డబ్బు పుట్టకపోవడం వలన అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు అవసరం ఉన్న వారు మాత్రం టెన్షన్ ను భరించలేక పోతున్నారు. ఆర్థికంగా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ.. కుటుంబాలను నెట్టుకొస్తున్న ఎంతో మంది సగటు కుటుంబాల వారు అవసరానికి డబ్బులు పుట్టక వచ్చిన ఆదాయం తోనే, ప్రస్తుతం పొదుపుగా ఖర్చు పెట్టుకోవాల్సిన ప్రస్తుతం పరిస్థితి నెలకొంది.
సిల్వర్ పైనే ఎక్కువ పెట్టుబడి..?
బంగారం ధర ఎప్పటికైనా కిందికి దిగొస్తుందన్న భావనతో ప్రతి ఒక్కరూ పెద్ద మొత్తంలో సిల్వర్ కొనుగోలు చేసి పెడుతున్నారు. మొన్నటి వరకు లక్షా 10 నుండి 20 వేలు ఉన్న కిలో వెండి ధర, ప్రస్తుతం లక్షా 70 వేల రూపాయలకు పైగా ధర పలుకుతుండడంతో ఇదే అదనుగా భావించి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ మెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని చోట్ల వడ్డీకి నగదు దొరక లేని పరిస్థితి నెలకొంది.
పెరిగిన రెడీమేడ్ నగల ధరలు..
బంగారం ధర విపరీతంగా పెరిగిపోతుండటంతో, చాలామంది రెడీమేడ్ గా దొరికే నగలపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఒక్కసారిగా వాటి ధరలు కూడా బాగా పెరిగిపోయాయి. అసలైన నగలు వేసుకుని బయటకు వెళితే, ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందన్న భయంతో చాలామంది బంగారు నగలను సీక్రెట్ ప్లేస్ లు, బ్యాంకు లాకర్ల లలో భద్రంగా దాచి పెట్టుకొని, రెడీమేడ్ నగలు వేసుకొని కాలం వెళ్లదీస్తున్నారు. పెరిగిన బంగారం ధరల నేపథ్యంలో చాలామంది రెడీమేడ్ నగలను ఆన్ లైన్ లో బుక్ చేసుకుని కొందరు, పట్టణాలకు వెళ్లి మరికొందరు కొనుగోలు చేస్తుండడం వల్ల ఈ నగల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.






