అత్యాచార బాధితురాలికి అండగా ఉంటాం : ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

by Nallavelli.Anjaneyulu |

దిశ, కామారెడ్డి : అత్యాచారానికి గురైన బాధిత మహిళ కుటుంబానికి అండగా ఉంటామని ఎస్సీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య హామీ ఇచ్చారు. పాల్వంచ మండలం ఫరీద్​పేట గ్రామానికి చెందిన ఓ మహిళ అత్యాచారానికి

అత్యాచార బాధితురాలికి అండగా ఉంటాం :  ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
X

దిశ, కామారెడ్డి : అత్యాచారానికి గురైన బాధిత మహిళ కుటుంబానికి అండగా ఉంటామని ఎస్సీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య హామీ ఇచ్చారు. పాల్వంచ మండలం ఫరీద్​పేట గ్రామానికి చెందిన ఓ మహిళ అత్యాచారానికి గురైన విషయం తెలుసుకున్న ఆయన శనివారం కామారెడ్డి పట్టణంలోని ఆర్​అండ్​బీ గెస్ట్​హౌస్​లో బాధిత మహిళను పరామర్శించారు. ఈ సందర్భంగా ఘటనకు సంబంధించిన వివరాలను కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి తో పాటు గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. బాధితురాలికి నష్ట పరిహారం అందించడానికి గల మార్గాలను చూడాలని ఏ ఎస్పీ కి సూచించారు. బాధితురాలి పిల్లల చదువుకు అండగా నిలిచేలా ప్రభుత్వంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చాక చక్యంగా నిందితుడిని పట్టుకున్న జిల్లా పోలీసులను ఆయన అభినందించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట రెవెన్యూ, పోలీస్, సఖి సెంటర్ నిర్వాహకులు ఉన్నారు.

Next Story