తమపై నమ్మకం ఉంచిన కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాం

by Ratna Kumari |

తమపై నమ్మకం ఉంచిన కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటామ‌ని, పార్టీని మరింత బలపరుస్తామ‌ని కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులుగా పంపరి లక్ష్మణ్ పేర్కొన్నారు.

తమపై నమ్మకం ఉంచిన కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాం
X

దిశ, కామారెడ్డి టౌన్ : తమపై నమ్మకం ఉంచిన కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటామ‌ని, పార్టీని మరింత బలపరుస్తామ‌ని కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులుగా పంపరి లక్ష్మణ్ పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీని ప్రకటించి తమకు స్థానం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కమిటీలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులుగా పంపరి లక్ష్మణ్, సబ్బని కృష్ణ హరి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి లుగా జూలూరి సుధాకర్, నిమ్మ విజయ్ కుమార్ రెడ్డి లు నియామకం పట్ల కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం శుక్రవారం ఏర్పాటు చేశారు. పార్టీ ఆదేశాల మేరకు పని చేస్తామని డీసీసీ కార్యవర్గంలో ఎన్నికైన ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రెటరీలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. తమపై నమ్మకం ఉంచి మాకు పార్టీ జిల్లా కార్యవర్గంలో స్థానం కల్పించినందుకు ప్రభుత్వ సలదారుడు షబ్బీర్ అలీ, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్ర శేఖర్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, గడ్డమీద మహేష్, తాటి ప్రసాద్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మామిళ్ళ అంజన్న, పంపరి శ్రీనివాస్, జమీల్, బండారి శ్రీకాంత్, సునీల్ గౌడ్, ఆబిద్, గంగారాం, మున్ను, ఉన్నారు.

Next Story