- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి నీటి కటకట
పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వ కృషికి స్థానిక నాయకుల ఉదాసీనత తోడైతే పేదల కళ్లలో ఆనందం చిగురిస్తుంది.

దిశ, మాచారెడ్డి : పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వ కృషికి స్థానిక నాయకుల ఉదాసీనత తోడైతే పేదల కళ్లలో ఆనందం చిగురిస్తుంది. దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డు తగిలిన చందంగా స్థానిక నేతల పని తీరు ఆటంకం కలిగిస్తుంది. దీంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. దీనికి మాచారెడ్ఠి మండలం సోమారం పేట్ గ్రామంలో జరిగిన ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. గ్రామానికి చెందిన బుర్ర లక్ష్మి, చిట్టివేని నర్సవ్వ అనే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు నీటి కటకట ఎదురైంది. ఇందిరమ్మ కమిటీ అనుమతితో గ్రామంలోని రైతు వేదిక వద్దనున్న పబ్లిక్ బోర్ మోటార్ పంప్ సెట్ నుంచి నీటిని వాడుకొని ఇంద్రమ్మ ఇల్లు నిర్మించుకుంటున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పాలకవర్గం ఏర్పడినందున సర్పంచ్ భర్త భర్త రాంరెడ్డి పంచాయితీకి 2000 రూపాయలు చెల్లించి నీటిని వాడుకోవాలని హుకుం జారీ చేస్తూ స్టార్టర్ డబ్బాకు తాళం వేశాడు. దీంతో వారి ఇళ్ల నిర్మాణ పనులు నిలిచిపోయాయి.
ఇదే విషయమై సర్పంచ్ భర్త రమేష్ రెడ్డిని వివరణ కోరగా.. దీనిపై మేము ప్రెస్ కు ఇవ్వాల్సింది ఏం లేదని, మొన్న గ్రామసభలో మాట్లాడుకోవడం జరిగిందని, ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునేవారు 2 వేల రూపాయలు గ్రామపంచాయతీకి కట్టాల్సిందే అన్నారు. భార్య సర్పంచ్ అయితే భర్తలు పెత్తనం చెలాయిస్తుంటే ఉదాసీనంగా వ్యవహరిస్తున్న అధికారులు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి పబ్లిక్ బోర్ మోటార్ నుంచి నీళ్లు ఇవ్వడానికి అదే ఉదాసీనత పనికిరాదా...? మహిళా సాధికారతను అధికారుల ఉదాసీనత తుంగలో తొక్కుతున్నట్టు కాదా? భర్తల పెత్తనం వల్ల రాజకీయంగా ఎదగాల్సిన మహిళలు వంటింటి కుందేలు గానే మిగిలి పోతున్నారు. పేరుకే మహిళా సర్పంచ్ పెత్తనంతా బర్తదే... చట్టాన్ని అమలు చేయాల్సిన అధికార యంత్రాంగం భర్తల పెత్తనం ముందు జీ... హుజూర్ అనక తప్పడం లేదనే విమర్శలు మూటగట్టుకుంటున్నారు.






