కొట్టుకుపోయిన రోడ్లు, కోతకు గురైన కల్వర్టులు..

by Nalla Sampath Reddy |

ప్రకృతి విపత్తు మూలంగా ఎన్ హెచ్ 765 డి రోడ్డు విస్తరణ పనులకు భారీగా నష్టం వాటిల్లింది.

కొట్టుకుపోయిన రోడ్లు, కోతకు గురైన కల్వర్టులు..
X

దిశ, నిజాంసాగర్ : ప్రకృతి విపత్తు మూలంగా ఎన్ హెచ్ 765 డి రోడ్డు విస్తరణ పనులకు భారీగా నష్టం వాటిల్లింది. ఎడతెరిపి లేకుండా నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు వరదల ప్రవాహం కారణంగా ఎన్ హెచ్ 765 డి రోడ్డు కోతకు గురవడంతో పాటు కల్వర్టులు కుంగిపోవడం, విస్తరణ పనుల సామాగ్రి కొట్టుకుపోయింది. మహమ్మద్ నగర్, నిజాంసాగర్ మండలాల్లోని నర్వ, మహమ్మద్ నగర్, బొగ్గు గుడిసె చౌరస్తా ప్రాంతాల్లో బాన్సువాడ, ఎల్లారెడ్డి ప్రధాన ప్రధాన రహదారి వరద బీభత్సానికి పూర్తిగా దెబ్బతింది. ఎన్ హెచ్ 765 డి రోడ్డు విస్తరణ పనులు చేపట్టగా వరద నేటి ప్రభల వృద్ధుడికి రోడ్లు కొట్టుకుపోయాయి. బొగ్గు గుడిసె చౌరస్తా వద్ద ప్రధాన రోడ్డు కోతకు గురవడం, నర్వ, మమ్మద్ నగర్ శివారులో కల్వర్టులు కోతకు గురై ప్రమాదకరంగా మారాయి. రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్న కీ స్టోన్ ఇన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు విపత్తు మూలంగా కోట్లల్లో నష్టం జరిగింది. కోతకు గురై, కొట్టుకుపోయిన రోడ్లకు సంబంధిత కాంట్రాక్టర్ తాత్కాలిక మరమ్మతు పనులు చేపడుతున్నారు. వరదనీటి ప్రవాహంలో వాటర్ ట్యాంకర్ మునిగిపోవడంతో పాటు ఇనుప రాడ్లు, కల్వర్టుల సామాగ్రి కొట్టుకుపోయింది.

Next Story