- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభివృద్ధిని చూసి కాంగ్రెస్ కు ఓటు వేయాలి : ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
అభివృద్ధిని చూసి ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేయాలని రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు.

దిశ, కామారెడ్డి : అభివృద్ధిని చూసి ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేయాలని రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. కామారెడ్డి ప్రగతి పథంలో కాంగ్రెస్ ముద్ర కొనసాగుతుందని, పట్టణంలోని 20, 21, 22, 23 వార్డుల్లో సుమారు 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించ తలపెట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు, ఇతర అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన గల్లీలను ఇప్పుడు ప్రగతి బాట పట్టిస్తున్నామన్నారు. బురద రోడ్లు పోయి సిమెంట్ రోడ్లు వస్తున్నాయి, మురికి నీటి సమస్య పోయి పక్కా డ్రైనేజీలు వస్తున్నాయన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం ఇందిరమ్మ రాజ్యం తెచ్చామన్నారు. ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ, రైతు భరోసా వంటి పథకాలతో ప్రతి ఇల్లు లబ్ధి పొందుతోందన్నారు.అధికారుల చుట్టూ తిరిగే పని లేకుండా, మీ సమస్యలను మీ వద్దకే వచ్చి పరిష్కరించే 'ప్రజా పాలన'ను సాగిస్తున్నామన్నారు.మున్సిపల్ ఎన్నికల్లో మన గెలుపు కామారెడ్డి మలుపు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి మీరు ఇచ్చే ప్రతి ఓటు, కామారెడ్డి అభివృద్ధికి వేసే పునాది అవుతుందన్నారు. మనం చేస్తున్న ఈ అభివృద్ధిని, మన నిబద్ధతను చూసి, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాను మున్సిపాలిటీపై ఎగురవేయాలని కోరారు. అభివృద్ధి కొనసాగాలంటే.. కాంగ్రెస్ కు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే తదుపరి లక్ష్యం అన్నారు.






