సమయపాలన పాటించని పశు వైద్యాధికారి

by Disha Web Desk 20 |
సమయపాలన పాటించని పశు వైద్యాధికారి
X

దిశ, పిట్లం : పిట్లం మండల కేంద్రంలో ఉన్న పశు వైద్యశాలలో వైద్యాధికారి సంతోష్ సమయ పాలన పాటించడం లేదని రైతులు ఆరోపించారు. మండల కేంద్రానికి చెందిన పాడి రైతులు పశువులను వచ్చిన రోగాల గురించి వైద్యశాలకు వెళితే అక్కడ తాళం వేసి ఉందని రైతులు తెలిపారు. ప్రజాప్రతినిథులు ఆయనకు సపోర్ట్ చేయడంతో వైద్యాధికారి ఇష్టా రీతిగా వ్యవహరిస్తున్నారని రైతులు చెబుతున్నారు. వైద్యుడు సమయానికి రాకపోవడంతో చేసేది ఏమీ లేక ప్రైవేటు పశువైద్య మెడికల్ షాపులలో మందులు కొనుగోలు చేసి వాటికి ప్రధమ చికిత్స చేస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ పశు వైద్యాధికారులు ప్రయివేటు మెడికల్ షాపులను మేపుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పశువైద్యశాల నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్నప్పటికీ మండల స్థాయి అధికారులు నీరుకాస్తున్నారు. అయినా స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోకుండా అధికారులకే వత్తాసు పలుకుతూ చోద్యం చూస్తున్నారు. పాడి రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా ఎవరు కూడా పట్టించుకోవడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు.

పశు వైద్యాధికారి సమయపాలన పాటించి ఉదయం పశువులకు చికిత్సలు చేయాలని కోరుతున్నారు. 1962 వాహనానికి ఫోన్ చేస్తే కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో రైతులు వైద్యుల కోసం ఎదురుచూసిన అవసరం ఏర్పడుతుంది. ఉదయం లేచి చూస్తే డాక్టర్ లేకపోవడంతో పశువులు మరణాలు ఎక్కువవుతున్నాయని రైతులు తెలిపారు. ఇకనైనా స్థానిక ప్రజాప్రతినిధిని స్పందించి డాక్టర్ను మందలించి సమయపాలన పాటించే విధంగా చేయాలని రైతులకు కోరుతున్నారు.



Next Story

Most Viewed