- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిజామాబాద్‌లో ప్రైవేటు ఆస్పత్రుల నిలువు దోపిడీ
నిజామాబాద్ జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ పరాకాష్టకు చేరింది. బిల్లు కడితేనే బిడ్డకు తల్లి పాలు ఇవ్వనిస్తామన్న ఆస్పత్రి యాజమాన్యం తీరు స్థానికంగా కలకలం రేపుతోంది.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : విద్య, వైద్యం సామాన్యుడికి అందుబాటులో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో ప్రజల వైపు ఆలోచించడం లేదనే విమర్శలున్నాయి. కనీసం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వాసుపత్రుల్లోనైనా అవసరమైన వైద్యపరికరాలను, స్పెషలిస్టు డాక్టర్లను అందుబాటులో ఉంచి ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించే దిశగా కూడా ప్రభుత్వాలు ఆలోచించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వాసుపత్రులపై, ఆస్పత్రుల్లో రోగులకు అందే వైద్య సేవలపై ప్రజలకు విశ్వాసం కలిగేలా ప్రభుత్వాసుపత్రులు పని చేయడంలేదనే విమర్శలున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బందితో, వైద్యులతో పని చేయించడం లేదు.
దీంతో ఉన్నతాధికారులు, కనీసం ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో విచ్చల విడిగా జరుగుతున్న దోపిడీనైనా నియంత్రించలేకపోతున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మెడికల్ మాఫియా కారణంగా చిన్నపాటి ఆరోగ్య సమస్యలకు కూడా వైద్యం పేరుతో భారీగా బిల్లులు వేస్తూ పేషంట్లను నిలువు దోపిడీ చేస్తున్నా పట్టించుకోని ఉన్నతాధికారుల తీరుపై ప్రజల్లో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ అధికారులకు చీమ కుట్టినట్లయినా లేదనే టాక్ వినిపిస్తోంది. పలుమార్లు బాధిత రోగుల బంధువులు ప్రైవేటు ఆస్పత్రుల భారీ బిల్లుల విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బిల్లు చెల్లిస్తేనే బిడ్డకు ఫీడింగ్ ఇప్పిస్తాం..
నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన గర్భిణీ మహిళ ప్రసవం కోసం నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చింది. ఆస్పత్రిల్లో సీజెరియన్ జరిగి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. తనకు పుట్టిన న్యూ బార్న్ బేబీ జాండీస్ ఉందని, చైల్డ్ కేర్ హాస్పిటల్ లో జాయిన్ చేయాలని, ఇంక్యుబేటర్ లో ఉంచాలని చెప్పడంతో బేబీ వేరే హాస్పిటల్ కు షిఫ్ట్ చేశారు. పేషంట్ భర్త ఓ కమర్షియల్ బ్యాంక్ ఎంప్లాయి కావడంతో వారికి ఫుల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ ఏవేవో కారణాలు చెప్పి రూ. 1 లక్ష కన్నా ఎక్కువ యాక్సెప్ట్ చేయలేమని, పాప ను షిఫ్ట్ చేసిన హాస్పిటల్ లో హెల్త్ ఇన్సూరెన్స్ ను అసలే యాక్సెప్ట్ చేయరని చెప్పడంతో బిల్లు మొత్తం చెల్లించాల్సి వచ్చింది. బేబీని జాయిన్ చేసిన హాస్పిటల్ యాజమాన్యం మొత్తం బిల్లు చెల్లిస్తేతప్ప బేబీ మదర్ ఫీడింగ్ ఇప్పించడం కుదరదని తెగేసి చెప్పడంతో బిడ్డకు ఫీడింగ్ ఇవ్వడానికి అనుమతించాలని ఆస్పత్రిలోనే తల్లి రోధించింది.
అయినా ఆస్పత్రి యాజమాన్యం మనసు కరగలేదు. ఈ విషయంపై తీవ్రంగా ఆగ్రహించిన పేషంట్ తండ్రి నిజామాబాద్ లోని మీడియాకు సమాచారమిచ్చి ఆందోళన చేయడంతో ఆస్పత్రి యాజమాన్యం వెనక్కి తగ్గి బిడ్డకు ఫీడింగ్ ఇచ్చేందుకు అనుమతించిన సందర్భాన్ని పేషంట్ బంధువులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. ఇలాంటి సంఘటనలు నిజామాబాద్ నగరంలో ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. ఇవన్నీ కామన్ అంటూ అధికారులు తేలిగ్గా తీసుకోవడం, మనల్నెవడేం చేస్తాడులే అని ధైర్యంగా చేయాల్సింది చేయడం ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యాలకు కూడా అలవాటైపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైద్యం పేరుతో దోపిడిచేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రుల ఆగడాలపై ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు ఫోకస్ చేయకపోతే సామాన్యులు వైద్యం కోసం అప్పులు చేసిన సామాన్యులు అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదాలున్నాయి. ప్రభుత్వం స్పందించాల్సిన అవసరముంది.






