- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్ పాలనలో పదేళ్లు సంక్షేమం.. రేవంత్ పాలనలో 17 నెలల విధ్వంసం
తెలంగాణలో పదేళ్లపాటు కేసీఆర్ పాలన సంక్షేమంలో నడిస్తే, గత 17 నెలలుగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన విధ్వంసంలో నడుస్తోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ :తెలంగాణలో పదేళ్లపాటు కేసీఆర్ పాలన సంక్షేమంలో నడిస్తే, గత 17 నెలలుగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన విధ్వంసంలో నడుస్తోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.నిజామాబాద్ నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తో కలిసి ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ పుట్టింది తెలంగాణ ప్రజల కోసమేనని, 15 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రజలకు విముక్తి కలిగించిన పార్టీ అని ఆయనన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత పదేళ్ల పాలనలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా కేసీఆర్ నిలబెట్టారని ప్రశాంత్ రెడ్డి అన్నారు. కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే తెలంగాణ ను విధ్వంసం చేశారని ప్రశాంత్ రెడ్డి ఎద్దేవాచేశారు.
కేసీఆర్ హయాంలో తలసరి ఆదాయంలో నెం.1
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో రాష్ట్ర తలసరి ఆదాయం దేశంలోనే నెంబర్ వన్ గా ఉండేదని, ప్రస్తుతం రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక అది 11 వ స్థానానికి పడిపోయిందన్నారు. జీ ఎస్ డీ పీలో కూడా కేసీఆర్ హయాంలో మూడో స్థానంలో ఉంటే అదిప్పుడు 14 వ స్థానానికి పడిపోయిందన్నారు. రేవంత్ రెడ్డి సీఎం గా అధికారం చేపట్టిన తరువాత తెలంగాణ లో రేవంత్ రెడ్డి చేసిన ఆర్థిక విధ్వంసానికి ఇదే పెద్ద ఉదహరణ అని ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో అనేక మాయ మాటలు చెప్పి, రాష్ట్ర ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ , రేవంత్ రెడ్డి మాటలు విని తెలంగాణ ప్రజలు మోసపోయారని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అధికారంలోకి వచ్చాక సక్రమంగా అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని ఆయనన్నారు.
పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదు..
రైతులకు సంపూర్ణ రుణమాఫీ జరగనే లేదని,,రైతుబంధు లేదు, ప్రతి ఆడబిడ్డకు రూ.2500 లు పెన్షన్ , ఆసరా పెన్షన్లు రూ. 2 వేల నుండి రూ.4 వేలకు పెంపుదల చేయడం, విద్యా భరోసా కార్డు, నిరుద్యోగ భృతి , సన్నాలపై రూ. 500 ల బోనస్ వంటి హామీలలో ఏ ఒక్క హామీని సంపూర్ణంగా అమలు చేయడం లేదని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ లబ్దిదారులకు రూ.1.16 లక్షలతో పాటు తులం బంగారం ఇస్తానన్న ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. తులం బంగారం ఎందుకివ్వడం లేదని అడిగినందుకు బాల్కొండ నియోజకవర్గంలో మా కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జీ చేశారన్నారు. 33 మంది బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమంగా కేసులు కూడా నమోదు చేశారని ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు.
సంక్షేమాన్ని గాలికొదిలేశారు.. జేబులు నింపుకుంటున్నారు..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిననాటి నుండి ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిందని ప్రశాంత్ రెడ్డి అన్నారు. దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆయనన్నారు. భూకబ్జాలు, కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు తీసుకొనిదే ఏ బిల్లులు మంజూరు చేయడం లేదని ఎమ్మెల్యే విమర్శించారు.
వరంగల్ సభకు వేలాదిగా తరలిరండి..
ఈనెల 27 న వరంగల్ లో జరగబోయే బీఆర్ఎస్ 25 ఏళ్ల రజతోత్సవ సభకు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని, కేసీఆర్ ను ఆశీర్వదించి బీఆర్ఎస్ కు మద్ధతు తెలపాలని ప్రశాంత్ రెడ్డి కోరారు.బీఆర్ఎస్ ఏర్పడి 25 ఏళ్లు కావస్తున్న సందర్భంగా పార్టీ సంవత్సరం పాటు రజతోత్సవ కార్యక్రమాలు చేయనుందని ఎమ్మెల్యే అన్నారు. వరంగల్ సభకు బ్రహ్మాండమైన ఏర్పాటు జరిగాయన్నారు. నభూతో న భవిష్యత్తు అనే విధంగా వరంగల్ సభ జరగబోతుందన్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయమని లక్షలాది మంది ప్రజల సమక్షంలో వారి మధ్య నుండి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికే ఈ వరంగల్ సభ నిర్వహిస్తున్నామని ప్రశాంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 దొంగ హామీల అమలుకు ఈ వరంగల్ సభ దోహదపడుతుందని ఎమ్మెల్యే అన్నారు.
వరంగల్ సభకు వెళ్లేందుకు ఏర్పాట్లు..
వరంగల్ సభకు వెళ్లేందుకు ఉమ్మడి నిజామాబాద్ నుండి 2400 ల వెహికిల్స్ సిద్ధంగా ఉన్నాయని ప్రశాంత్ రెడ్డి అన్నారు. 250 ఆర్టీసీ బస్ లు,264 ప్రైవేట్ బస్ లు , ప్రైవేట్ తుఫాన్లు టాక్సీలు 626 ఓన్ కార్లు 1266 మొత్తంగా 2400 వాహనాల్లో 40 వేల మంది సభకు తరలిరానున్నారని, ఈ సంఖ్య 50 వేలు దాటినా ఆశ్చర్యపోనవసరం లేదని ప్రశాంత్ రెడ్డి అన్నారు.
మహారాష్ట్ర, కర్ణాటక నుండి వెహికిల్స్ తెప్పించాం..
నిజమాబాద్ ఉమ్మడి జిల్లా నుండి వరంగల్ సభకు వెళ్లేందుకు గ్రామాల నుండి ప్రజలు స్వచ్ఛందంగా తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయనన్నారు. ఉమ్మడి జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి, ముజీబ్ ఎమ్మెల్సీ కవితమ్మ, ఎంపీ సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్,గణేష్ గుప్తా,గంప గోవర్ధన్,షకీల్,సురేందర్, హన్మంత్ షిండే అందరం సభ విజయవంతానికి సమన్వయంతో పని చేస్తున్నామని ప్రశాంత్ రెడ్డి అన్నారు. వరంగల్ సభ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నిలబెడుతుంది కావున వేలాదిగా తరలివచ్చి కేసీఆర్ ను ఆశీర్వదించాలని జిల్లా ప్రజలను ఎమ్మెల్యే కోరారు.
మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ..
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఘోరంగా విఫలమైందని, గోల్ మాల్ గోవిందంలా కాంగ్రెస్ పార్టీ తయారైందన్నారు. ఆ పార్టీలో ఎక్కడా లేనంత అవినీతి రాజ్యమేలుతుందని గోవర్ధన్ అన్నారు. కమిషన్ లేనిదే ఏ పని నడవడం లేదని, తెలంగాణలో దోచుకొని ఢిల్లీకి మూటలు కట్టి పంపుతున్నారని బాజిరెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా నీతిమంతులు ఉంటే రేవంత్ రెడ్డిని దించి ఆ పదవిని చేపట్టాలని బాజిరెడ్డి సలహా ఇచ్చారు. రేవంత్ రెడ్డిది నోరు కాదు మోరి అని, కేసీఆర్ బయటకు వస్తున్నాడని రేవంత్ రెడ్డి భయపడుతున్నాడన్నారు. ఎలాగైనా వరంగల్ సభను అడ్డుకోవాలని చూస్తున్నాడని ఆరోపించారు. వరంగల్ సభకు అని ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయినట్లు తెలిపారు. మీడియా సమావేశానికి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ విఠల్ రావు, మాజీ మేయర్ నీతూ కిరణ్, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్, సత్య ప్రకాష్ సిర్ప రాజు, సుజీత్ ఠాకూర్, మాజీ జెడ్పిటిసి లు బాజిరెడ్డి జగన్మోహన్, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ గడ్డం సుమన తదితరులు పాల్గొన్నారు.






