కలెక్టర్ కార్యాలయంలో వాల్మీకి జయంతి వేడుకలు

by Nallavelli.Anjaneyulu |

దిశ, కామారెడ్డి టౌన్ : కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మహాకవి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా

కలెక్టర్ కార్యాలయంలో వాల్మీకి జయంతి వేడుకలు
X

దిశ, కామారెడ్డి టౌన్ : కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మహాకవి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జ్యోతి ప్రజ్వలన చేసి వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడారు. “మహర్షి వాల్మీకి ఆదికవి, ఆయన రచించిన రామాయణం నిత్యనూతన గ్రంథం. ఆయన చూపిన సత్యం, ధర్మం, న్యాయం మార్గం ప్రతి మనిషి జీవనానికి మార్గదర్శకం” అని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు రెవెన్యూ కలెక్టర్ విక్టర్, లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ చందర్, డీఆర్వో ట్రైని డిప్యూటీ కలెక్టర్ రవితేజ, కలెక్టరేట్ ఏవో, డీఎస్సీడీవో వెంకటేష్, డిఎం డబ్ల్యూ సతీష్ యాదవ్, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జయరాజ్ , సహాయ బీసీ అభివృద్ధి అధికారి చక్రధర్ , నరేష్ , అశ్వాక్, జీవన్, శాంతయ్య, స్వామి పాల్గొన్నారు.

Next Story