- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాచారెడ్డిలో జలప్రళయం.. ప్రమాదకరస్థాయిలో ఎగువ మానేరు డ్యాం
అల్పపీడన ద్రోణి ప్రభావంతో బుధవారం కురుస్తున్న వర్షాలు జల ప్రళయాన్ని సృష్టించాయి. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో

దిశ, మాచారెడ్డి: అల్పపీడన ద్రోణి ప్రభావంతో బుధవారం కురుస్తున్న వర్షాలు జల ప్రళయాన్ని సృష్టించాయి. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో బుధవారం జలప్రళయం చోటుచేసుకుంది. వాగులు ప్రమాదకరస్థాయిలో పొంగి ప్రవహించడంతో వంతెనలు, రోడ్లు తెగిపోయాయి. కామారెడ్డి - సిరిసిల్ల ప్రధాన రహదారిలోని పాల్వంచ బ్రిడ్జిపై నుండి ప్రమాద స్థాయిలో వాగు పొంగి ప్రవహించడం తో అప్రోచ్లు తెగిపోయాయి. భవానిపేట్ - పోతారం గ్రామాల మధ్యలో గల వంతెన, బండ రామేశ్వర్ పల్లి- లచ్చ పేట, చుక్కాపూర్- బండ రామేశ్వర్ పల్లి గ్రామాల మధ్యలో ఉన్న బ్రిడ్జి అప్రోచ్లు కూడా తెగిపోయాయి. ఫర్ది పేట్ - వాడి గ్రామాల మధ్య గల లొట్టి వాగు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. ఇక అటు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లోని ఎగువ మానేరు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తుంది. ప్రవాహంలో చిక్కుకుని ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు స్థానిక ఎస్సై అనిల్ వివరించారు.






