'మీసేవ సెంటర్‌'లో ఆగని అక్రమ వసూళ్ల దందా..!

by Nallavelli.Anjaneyulu |

దిశ, కమ్మర్ పల్లి : మండలంలో మీసేవ నిర్వాహకుల అక్రమ వసూలు దందా అడ్డాగా మారింది. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అరికట్టాలని సంకల్పంతో ఏర్పాటు

మీసేవ సెంటర్‌లో ఆగని అక్రమ వసూళ్ల దందా..!
X

దిశ, కమ్మర్ పల్లి : మండలంలో మీసేవ నిర్వాహకుల అక్రమ వసూలు దందా అడ్డాగా మారింది. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అరికట్టాలని సంకల్పంతో ఏర్పాటు చేసిన మీసేవ కేంద్రాలు అవినీతి అక్రమాలకు వేదికగా మారాయి. ఈ కేంద్రాల్లో అవినీతి జరుగుతుందని తెలిసినా స్థానికంగా ఉండే రెవెన్యూ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. దీంతో మీ సేవా నిర్వాహకుల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కమ్మర్ పల్లి మండలంలోని 10 మీ సేవా నిర్వాహకులు అధిక వసూళ్లకు పాల్పడుతున్న అధికారులు పట్టించుకోక పోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రజలు చర్చించుకుంటున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరిపి, మీ సేవ నిర్వాహకులపై చర్యలు చేపడితే అధిక వసూళ్లకు పాల్పడరని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదంతా మామూలే..

మీసేవ కేంద్రాల అక్రమ వసూలు అధికారుల దృష్టిలో ఇదంతా మామూలేగా అన్నట్లు ఉంది. అందువల్లే అవినీతి జరుగుతున్న వారు పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. మీసేవ కేంద్రాల నిర్వాహకులు వివిధ పనుల కోసం వచ్చే ప్రజల దగ్గర రశీదు మీద ఉన్న ధర కంటే ఎక్కవ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇతర వినియోగదారుల పనులను పక్కన పెట్టి దళారుల పనులను ముందుగా చేస్తున్నారు. అంతే కాకుండా రాష్ట్ర, కేంద్ర పధకాల్లోని ఆసరాగా తీసుకొని ప్రజల నుంచి డబ్బులు కాజేస్తున్నారు.

మీసేవా కేంద్రాలపై అధికారుల పర్యవేక్షణ కరువు

మీసేవా కేంద్రాలపై అధికారుల తనిఖీలు చేయడం లేదు. తనిఖీలు చేసిన నామమాత్రపు తనిఖీ నిర్వహించి పై స్థాయి అధికారులకు నివేదిక పంపిస్తున్నారు. తద్వారా జిల్లా స్థాయి అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. సెప్టెంబర్ 16 మండల కేంద్రాల‌ని 3 మీసేవ కేంద్రాలను తనిఖీలు నిర్వహించి నివేదిక జిల్లా అధికారులకు పంపించినట్లు తాసిల్దార్ తెలిపారు. నివేదిక పంపించి 20 రోజులు కావస్తున్న ఇప్పటివరకు జిల్లా స్థాయి అధికారుల నుండి ఎటువంటి చర్యలు చేపట్టలేదు. దీని వెనక రెవెన్యూ అధికారుల హస్తమున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. మీసేవ కేంద్రాలు అనుమతులు ఒకరి పేరు ఉండగా నిర్వహించేది మరొకరు.. కొన్ని కేంద్రాల్లో అయితే శిక్షణ లేని వారిని నియమించుకోవడంతో దరఖాస్తుల్లో తప్పులు ఉంటున్నాయి. యజ మానులకు బదులు ఇతరులు నిర్వహిస్తుండటంతో సేవల ధరల పట్టికను అనుసరించడం లేదు. మీ సేవ అవినీతి పై దృష్టి సారిస్తే అనేక అవినీతి అక్రమాలు బహిర్గతమవుతాయి. ఆధార్ నమోదు సౌకర్యం ఉన్న మీసేవా కేంద్రాల్లోనూ ఇదే తంతు కొనసాగుతుంది. మీసేవ కేంద్రాల్లో దందాలను అరికట్టి సంక్రమంగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.

Next Story