కేసీఆర్ వల్లనే రైతుల ఆత్మహత్యలు.. 17 వేల కోట్ల రుణమాఫీ ఏమైంది: కేంద్ర మంత్రి Nirmala Sitharaman

by Disha Web Desk 12 |
కేసీఆర్ వల్లనే రైతుల ఆత్మహత్యలు.. 17 వేల కోట్ల రుణమాఫీ ఏమైంది: కేంద్ర మంత్రి Nirmala Sitharaman
X

దిశ, గాంధారి: టీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్‌లో ఇచ్చినటువంటి హామీలు ఎందుకు నెరవేర్చలేకపోతున్నారని కేసీఆర్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గాంధారి మండల కేంద్రంలో శనివారం మారుతి ఫంక్షన్ హాల్లో లోక్ సభ ప్రభాస్ యోజన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ మాట్లాడుతూ.. తెలంగాణలో రైతు ఆత్మహత్యలకు టీఆర్ఎస్ ప్రభుత్వం కారణం. తెలంగాణలోని 24370 మంది రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారు. దీనికి కేసీఆర్ సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు.

రైతులు ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తే అధికారంలోకి వచ్చాక వరి వేస్తే ఊరే అనే మాటలు దేనికి సంకేతం అని విమర్శించారు. ఎలక్షన్ సమయంలో హామీలు 17 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు రుణమాఫీ మాటనే మర్చిపోయారని అన్నారు. పక్క రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలు 60 శాతం అయినా అమలు చేశాను కానీ తెలంగాణలో మాత్రం ఐదు శాతం మాత్రమే రుణమాఫీ చేసిందని అన్నారు. పీఎం కిసాన్ యోజన పథకం తెలంగాణకు 6000 కోట్లు ఇస్తే కేవలం 765 కోట్లు మాత్రమే రైతులకు అందించిందని అన్నారు.

యూరియాను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే ఒక యూరియా బస్తాకు 20,450 రూపాయలు ఉన్న బస్తా తెలంగాణ రాష్ట్రంలో కేవలం 270 రూపాయలకి కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని ఇది అందరికీ తెలియదని.. దీన్ని రైతులందరూ అర్థం చేసుకోవాలని.. రాబోయే తరానికి ఒక నిదర్శనం కావాలని.. కేంద్ర మంత్రి సీతారామన్ అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి రైతుకు చేరాలని యూరియా యొక్క భారం రైతుపై పడకుండా కేంద్రం ఎంతగానో కృషి చేస్తున్న అందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం సహకరించడం లేదని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు అరుణ తార, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ బాణాల లక్ష్మారెడ్డి, మురళీధర్ గౌడ్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు పోతాంగల్ కిషన్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నీలం చిన్న రాజులు, కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జ్ కాటిపల్లి వెంకట రమణారెడ్డి, బాన్సువాడ నాయకులు మాల్యాద్రి రెడ్డి, జిల్లా పదాధికారులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, ఆయా మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సీపీఎస్ ను రద్దు చేయాలని వినతి

సీపీఎస్ ను రద్దు చేయాలని గాంధారి మండల సీపీయస్ ఉపాధ్యాయ యూనియన్ ఆధ్వర్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ గారికి వినతి పత్రం అందజేసినట్లు యూనియన్ అధ్యక్షులు చిరంజీవి, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ రాథోడ్ లు తెలిపారు. 2004 నుంచి ఉద్యోగుల్లో చేరిన వారికి పదవీ విరమణ తర్వాత పింఛన్ సౌకర్యం ఉండదని తద్వారా వారి కుటుంబాలు వీధిన పడే అవకాశం ఉంటుందని ఉపాధ్యాయులు వాపోయారు. ఇప్పటికే రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో సీపీయస్ రద్దు కాగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఉద్యమాలు జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

AlsoRead: అన్నదాత మృత్యు ఘోష.. ఏడేండ్లలో 5 వేల మంది ఆత్మహత్య

Next Story