యూట్యూబ్‌ను షేక్ చేసిన ఎన్టీఆర్ ‘దేవర’ ఫియర్ సాంగ్.. వరల్డ్ వైడ్‌గా ఎన్ని వ్యూస్ వచ్చాయంటే!

by Hamsa |
యూట్యూబ్‌ను షేక్ చేసిన ఎన్టీఆర్ ‘దేవర’ ఫియర్ సాంగ్.. వరల్డ్ వైడ్‌గా ఎన్ని వ్యూస్ వచ్చాయంటే!
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కాంబోలో రాబోతున్న సినిమా ‘దేవర’. దీనిని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇందులో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే దేవర నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసిన ఫియర్ సాంగ్‌ను మేకర్స్ ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఫియర్ సాంగ్‌ విపరీతమైన వ్యూస్ సాధిస్తుంది. ప్రేక్షకులను ఆకట్టుకుంటూ యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్, లైక్స్ రాబడుతూ ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది.

తాజాగా, దీనికి సంబంధించిన పోస్టర్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దేవర ఫియర్ సాంగ్‌కు ఇప్పటి వరకు 50 మిలియన్ల వ్యూస్ సాధించి టాప్ వన్ ప్లేస్‌లో ఉంది. అలాగే వరల్డ్ వైడ్‌గా దేవర సాంగ్ తెలుగు వర్శన్ 7, 329,218 వ్యూస్త సాధించడంతో పాటుగా 17,457 లైక్స్ వచ్చాయి. అయితే ఇది ప్రపంచం మొత్తంలో ఎక్కువ చూసిన సాంగ్‌గా నిలిచి మొట్టమొదటి ప్లేస్‌ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్ కావడంతో ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Next Story

Most Viewed