Ambati: వైసీపీ ఓటమి పక్కా.. స్పష్టం చేసిన అంబటి..

by Indraja |
Ambati: వైసీపీ ఓటమి పక్కా.. స్పష్టం చేసిన అంబటి..
X

దిశా వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌‌‌లో ఇటీవల ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కాగా ఎన్నికల ఫలితాలు జేన్ 4వతేదీన విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో పోలింగ్ వేళ రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తూ236, 237, 253, 254 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ నిర్వహించాలని కోరుతూ అంబటి రాంబాబు ఏపీ హై కోర్టులో పిటిషన్‌ ధాఖలు చేశారు. అలానే ఈసీ, సీఈఓ సహా ఐదుగురిని ప్రతివాదులుగా ఈ పిటిషన్‌లో చేర్చారు.

అందరు ఫలితాలకోసం ఎదురు చూస్తున్న సమయంలో అంబటి రీపోలింగ్ నిర్వహించాలని కోరడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వైసీపీకి ఓటమి తప్పదని అంబటికి అర్థమైందని, అందుకే రీపోలింగ్ అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టారని పలువురు ఎద్దేవ చేస్తున్నారు.

అధినేత విదేశాల్లో.. అంబటి పరేషాన్‌లో..

వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలింగ్ ముగిసిన తరువాత విదేశీ టూర్‌కి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబసమేతంగా లండన్, యుకే, స్విట్జర్లాండ్‌లో సేదతీరుతున్నారు. కాగా ఎన్నికలు ముగిశాయి, ఫలితాలు కూడా తమకు అనుకూలంగానే వస్తాయని, ఈసారి కూడా భారీ మెజారిటీతో వైసీపీ అధికారంలోకి వస్తుందని జగన్ ధిమాతో ఉంన్నారు.

కందకులేని దురద కత్తికి ఎందుకో అన్నట్టు ముఖ్యమంత్రి గెలుస్తామనే ధీమాతో ఉన్నప్పుడు అంబటి ఎందుకు పోలింగ్ వేళ రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తూ 236, 237, 253, 254 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ నిర్వహించాలని కోరుతున్నారు. అంటే 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందనే విషయం అంబటికి అర్థమైపోయిందా..? అని పలువురు ఎద్దేవా చేస్తున్నారు. నిజంగా పోలింగ్‌ వేళ రిగ్గింగ్ జరిగింది నిజమైతే వైఎస్ జగన్ సైలెంట్‌గా ఉంటారా..? సమస్యను పరిష్కరించకుండా విదేశీ టూర్ వెళ్తారా..? అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

Next Story

Most Viewed